ఏపీలో మిస్ అయిన 453 మంది విదేశీయులు..ఎక్కడున్నారు ?

112

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల 60 వేల మందికి పైగా దీని బారిన పడ్డారు. ఇండియాలో కరోనా పాజిటివ్ ల సంఖ్య 900 దాటింది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశంలో 21 రోజుల పాటు లౌక్ డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతోంది. ఇక కరోనా కేసులు ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారిలోనే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు భారత్ లో నమోదైన చాలా కేసులు విదేశాల నుండి వచ్చిన వారే కావడం గమనార్హం. దీనితో వివిధ దేశాల నుంచి భారత్ కు వచ్చేవారిపై నిఘా పెట్టాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

అలాగే విదేశాల నుండి వచ్చిన వారు తగిన పరీక్షలు నిర్వహించుకుని – క్వారంటైన్ లో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ తాజాగా లెక్కల ప్రకారం చూస్తే విదేశాల నుండి ఏపీలోని విశాఖకు వచ్చిన వారిలో 453 మంది ఆచూకీ లభించడం లేదు. వారంతా ఏమయ్యారో – ఎటు వెళ్లారో అంతుచిక్కడం లేదు. దీనిపై అధికారులతో పాటు ప్రజాసంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చిన తరువాత గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి విశాఖపట్నానికి వివిధ మార్గాల్లో వచ్చిన వారి వివరాలు జిల్లా అధికారులు సేకరించారు.

Coronavirus cases rise to 30 in India; Ghaziabad man tests positive
సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

కాగా ఇటీవల వైద్య – ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని ఇక్కడకు వచ్చినప్పుడు మొత్తం 3746 మంది విదేశాల నుంచి విశాఖ వచ్చారని ప్రకటించారు. వారందరు 14 రోజులు క్వారంటైన్ లో వుండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.జిల్లా అధికారులు కరోనాకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడిస్తూ 2795 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చారని వారంతా హోమ్ క్వారంటైన్ లో వున్నారని పేర్కొన్నారు. వారిలో 28 రోజులు పూర్తయినవారు 137 మంది – 15-27 రోజులు పూర్తయినవారు 999 మంది – 14 రోజులలోపు వారు 1498 మంది వున్నారని వివరించారు. కానీ మిగిలిన 453 మంది ఎక్కడున్నారో తెలియడం లేదు అని జిల్లా కలెక్టర్ తెలిపారు. కొందరు పాస్ పోర్టులో పేర్కొన్న చిరునామాల్లో లేరని ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదన్నారు. దీనితో విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా వుంటే…స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు తెలిపాలని – ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Content above bottom navigation