బ్రేకింగ్ మరో ఘోర పడవ ప్రమాదం.. ఎంత మంది చనిపోయారో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

162

ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా వ‌రుస‌గా ప‌డ‌వ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి…అలాగే తెలుగు రాష్ట్రాల్లో పడవ ప్రమాదాలు జరుగుతున్నా మనలో కానీ, ప్రభుత్వంలో కానీ కదలిక రావడం లేదు ఎన్ని ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు కంగారుపడటం బాధపడటం తప్ప ప్రమాదమే జరగకుండా చేపట్టాల్సిన చర్యలను మాత్రం అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగి ఉండేది కాదు.

Image result for godavari boat

అధికారుల అలసత్వం, పర్యాటక శాఖ అంతులేని నిర్లక్ష్యం అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. బోట్ సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరగరాని ఘోరం జరిగింది. లైఫ్‌ జాకెట్లు ఇవ్వమని ప్రయాణికులు మొత్తుకున్నా పట్టించుకోకపోవడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఇదంతా అన్నీ బాగున్న మ‌న ప్రాంతంలో జ‌రిగింది ..కాని పొట్ట చేత‌ప‌ట్టుకుని, కూలి నాలి కోసం వేరే దేశానికి వెళుతున్న వారి జీవితాలు సముద్రంలో క‌లిసిపోయాయి.

బంగ్లాదేశ్‌ మార్టిన్ దీవుల్లో విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యాలతో ప్రయాణిస్తున్న ఓ పడవ.. సముంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. వెంటనే సముద్ర తీర ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పడవ నిర్వాహకులు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతోనే.. ఈ ఘటన జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికార ప్రతినిధి హమీదుల్‌ ఇస్లామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ దక్షిణ తీర ప్రాంతం నుంచి..మలేషియా బయల్దేరిన రోహింగ్యా శరణార్థుల పడవ.. మార్టిన్ దీవుల సమీపంలో మునిగిపోయిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 130 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారని.. సముద్రంలో 15 మృతదేహాలను వెలికితీశామన్నారు. సమాచారం అందుకున్న వెంటనే.. గజ ఈతగాళ్ల సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. పడవ మునక ఘటనపై అంతర్జాతీయ శరణార్థి సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటీవ‌ల శ‌ర‌ణార్దులు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ‌లు ప్ర‌మాదాల‌కు గురి అవుతున్నాయి అనేది తెలిసిందే.. తాజాగా ఇలాంటి ప్ర‌మాద‌మే జ‌రిగింది అంటున్నారు, తాజాగా ఈ ప్ర‌మాదం పై ఇంట‌ర్ నేష‌న‌ల్ మీడియా దీని గురించి అనేక వార్త‌లు ఇస్తోంది.

ఈ క్రింది వీడియోని చూడండి :

Content above bottom navigation