హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం : బ్రిడ్జి పైనుంచి పడిన కారు.. ఒకరు మృతి

80

హైద‌రాబాద్ లో ఓ ఆర్ ఆర్ ద‌గ్గ‌ర ప్ర‌మాద ఘంటిక‌లు మోగేవి..డేంజ‌ర్ జోన్ గా చాలా జాగ్ర‌త్త‌గా అక్క‌డ డ్రైవ్ చేయ‌మ‌నేవారు.కాని ఇప్పుడు ప్లై ఓవ‌ర్లు ప్ర‌మాదాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతున్నాయి.బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. భరత్‌నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్‌వైపు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని సోహెల్‌గా గుర్తించారు. గాయపడిన వారిని బోరబండ పండిట్ నెహ్రూ నగర్ కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ AP 11 R 9189.

Image result for hyd flyover accident today

కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వస్తుండగా కారు అదుపు తప్పింది. భరత్ నగర్ బ్రిడ్జిపై కింద పడింది. దాదాపు 30 అడుగుల పైనుంచి కిందపడటంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి కింద ఎక్కువమంది జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Image result for hyd flyover accident today

యాక్సిడెంట్ లో చనిపోయిన సొహైల్.. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో తన బంధువులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. కాని మంగళవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం హాలీవుడ్ సినిమాల్లో స్టంట్ సీన్ ను తలపించిందని.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో కారు వేగం 100 కిలోమీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి.. బ్రిడ్జి పైనుంచి పల్టీలు కొడుతూ కిందపడిందంటున్నారు రాత్రి స‌మ‌యం కావ‌డం, కారు పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది అని స్ధానికులు చెబుతున్నారు. కారు పడిన ప్రదేశానికి 10 నుంచి 20 మీటర్ల దూరంలో కొందరు కూలీలు పని చేస్తున్నారు. ఒకవేళ కారు కనుక వారి మీద పడి ఉంటే.. ఊహించని రీతిలో ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. కారు పైనుంచి కింద పడటాన్ని కళ్లారా చూసిన కూలీలు.. భయంతో పరుగులు తీశారు. వారి ఒళ్లు జలదరించింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు.

ఈ క్రింది వీడియోని చూడండి

అంత ఎత్తు నుంచి కారు కిందపడటంతో షాక్ కి గురయ్యారు. ఎవరి మీద అయినా ఈ వేగంతో కారు పడి ఉంటే.. ఘోరం జరిగేదన్నారు. గ‌త ఏడాది నవంబర్ 23న గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనా ఇదే తరహాలో కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓవర్ స్పీడ్ తో కారు నడిపాడు. అదుపు తప్పిన కారు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడింది. కింద రోడ్డుపై నిల్చున వ్యక్తులపై కారు పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులకు ఏమీ కాలేదు. రోడ్డుపై నిల్చున్న అమాయకుల్లో ఓ మహిళ చనిపోవడం అందరిని బాధించింది. కొందరు తీవ్ర గాయాలతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కారు ప్రమాదం పలువురు అమాయకుల జీవితాల్లో తీరని విషాదం నింపింది. అందుకే అతివేగం అన‌ర్దానికి కార‌ణం కాస్త వేగం నియంత్రించుకోండి సేఫ్ గా ఇంటికి వెళ్లండి అంటున్నారు పోలీసులు… కారు బైక్ డ్రైవ్ చేసే ముందు చాలా జాగ్ర‌త్త‌లు పాటించండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation