వెండితెర ధోని ఆత్మహత్య .. షాక్ లో సినీ ప్రపంచం

112

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్.. ‘ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని ఆయన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆయన వయసు 34 సంవత్సరాలు. డిప్రెషన్‌తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టు పోలీసులు, ఆయన స్నేహితులు చెబుతున్నారు. సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు.

కాగా, సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 8న ముంబైలోని మలాద్‌లో ఓ భవంతి 14వ అంతస్తు నుంచి దూకి దిశా బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఇప్పుడు సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలన సృష్టిస్తోంది. సుశాంత్ మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Content above bottom navigation