ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 17 మంది మృతి

126

ఈ మధ్య వరుసగా ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా ప్రజ్నాపూర్, కరీంనగర్ జిల్లా మానుకొండూరు. కర్ణాటక రాష్టం ఉడిపి… ప్రాంతమేదైనా, కారణమేదైనా రహదారులు మాత్రం రక్తాన్ని చిందిస్తున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపటం, రహదారుల రూల్స్ పాటించకపోవటం వంటి పలు కారణాలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో అమాయకులు కూడా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళి అలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే ఒకటి చోటుచేసుకుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువూరు జిల్లా అవినాశి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును భారీ కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందన బస్సు బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తుండగా తిరువూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బస్సులోని ప్రయాణికులే కాగా, వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. బుధవారం రాత్రి 48 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి బయలుదేరిన వోల్వో బస్సును గురువారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అవినాశి వద్ద భారీ కంటెయినర్ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో చాలా మంది త్రిసూర్, పాలక్కడ్, ఎర్నాకులం ప్రాంతానికి చెందినవారే ఉన్నారు.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా చనిపోయినట్టు కేరళ రవాణా మంత్రి ఏకీ శశీంద్రన్ తెలిపారు. కంటెయినర్ టైర్లు పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన మరో 23 మందికి అవినాశి హాస్పిటల్‌లో చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం అవినాశి హాస్పిటల్‌కు తరలించారు. మారుమూల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాలను కోయంబత్తూరు, తిరుపూర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ పళనిస్వామి ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడినవారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం పళనిస్వామి సూచించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation