Breaking News : దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కురుమయ్య మృతి..

89

తెలంగాణలో గత ఏడాది జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు డిసెంబర్ 6 వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో హతమార్చారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపేశారు. ఈ ఘటన తర్వాత దిశా కుటుంబ సభ్యులే కాదు నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఇక ఈ ఎన్ కౌంటర్ వలన ఎక్కువగా నష్టపోయింది నిందితులలో ఒకడైన చెన్నకేశవులు కుటుంబం అనే చెప్పుకోవాలి. చెన్నకేశవులు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరొక విషాదం చోటుచేసుకుంది. ఈ ఇంటికి పెద్ద దిక్కు అయినా చెన్నకేశవులు తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య మృతిచెందారు. చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ జరిగిన కొద్దిరోజులకు ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స పొందిన ఆయన్ను ఇటీవలే స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఆయన మృతి చెందారు. ఇంటిని పోషించే చెన్నకేశవులు,కురమయ్య ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెకు ఆర్థిక సాయం చేయాలంటూ ట్విట్టర్‌లో విజ్ఞప్తి కూడా చేశారు.కోడలు పండంటి బిడ్డకు జన్మించ్చి ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. ఇంతలో ఈ విషాద ఘటన ఆ ఇంట్లో చోటుచేసుకుంది.

disha accused chennakesavulu father died

ప్రస్తుతం దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించిన విచారణ కోర్ట్ లో కొనసాగుతోంది. దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను ఆయన ఇటీవల కలిశారు. ఆమె నుంచి చాలా విషయాలు సేకరించిన వర్మ, ఆమెకు కొంత ఆర్థిక సహాయం కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎంత మొత్తంలో డబ్బు వచ్చిందనేది తెలియలేదు. అలాగే దిశా సినిమా విషయం మీద పలువురు పోలీసు అధికారులతో కూడా భేటీ అయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో అసలేం జరిగింది అనే విషయాల గురించి పూర్తీగా తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాను స్టార్ట్ చేశాడు వర్మ. తొందర్లోనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation