Breakingnews : నిర్భయ కేసులో మరో కొత్త ట్విస్ట్..

పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషులకు ఉరితీసే సమయం దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఉరిశిక్ష పడనుంది. ఉరి శిక్ష అమలుకు తీహార్‌ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగరు కామాంధులు మృత్యువు కోరల నుంచి తప్పించుకోవడానికి చట్టపరంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో.. అన్నింటినీ వినియోగిస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుసబెట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. చట్టపరంగా అందుబాటులో ఉన్న క్యురేటివ్ పిటీషన్, క్షమాభిక్ష పిటీషన్.. క్షమాభిక్ష పిటీషన్‌ను పునఃసమీక్షించాలని కోరుతూ మరో పిటీషన్.. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా వరుస పిటీషన్లను దాఖలు చేస్తూ వస్తున్నారా కామాంధులు.

ఈ క్రింది వీడియో చూడండి

తాజాగా దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరో నాటకానికి తెరతీశాడు. తాజాగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పేర్కొన్నాడు. అలాగే , దిగువ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని పవన్‌ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. అంతేకాదు పవన్ తన పిటిషన్లో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని పేర్కొన్నాడు. ఇప్పటికే వీరి ఉరిశిక్ష రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఉరికి నాలుగు రోజుల ముందు పవన్ కుమార్ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కూడా తన తరుపు లాయర్ ను మార్చాలని కోరుతూ పిటిషన్ వేశాడు. ఇప్పుడు మళ్ళి ఇలా కొత్త పిటిషన్ వేసి ఉరిని వాయిదా వేస్తున్నాడు.

Image result for నిర్భయ కేసులో మరో కొత్త ట్విస్ట్..

కాగా పవన్ కుమార్ తో సహా నలుగురు దోషులను ఉరితీయాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నందున దోషుల ఉరిశిక్ష గతంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో మరోసారి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు శిక్షను వాయిదా వేస్తుందా..? లేక శిక్ష అమలు చేస్తుందా వేచి చూడాలి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation