అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కి వచ్చిన పార్సిల్లో విషం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిసిన్ అనే విష పదార్థాన్ని ఎన్వలప్లో లభించినట్లు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరునామాతో వచ్చిన ఈ కవర్ను అడ్డుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..!
ఇందులో ఉన్నది రిసిన్ అనే ప్రమాదకర విషమేనని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు చెప్పారు. రెండు పరీక్షల్లోనూ ఇదే విషయం వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ విషం సాధారణంగా ఆముద గింజల్లో లభ్యమవుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: గంగవ్వ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… ఇక టైటిల్ గంగవ్వదే…
ఈ ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్బీఐ, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పోస్టల్ ఇన్స్పెక్షన్ సర్వీసులు సంయుక్తంగా దీనిపై విచారణ ప్రారంభించాయి. ఇది కెనడా నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లికి నో చెప్పిందని ప్రేయసి పై దాడి, ప్రైవేటు ఫోటోలు లీక్ చేసి..
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: