నడ్డి రోడ్డు పై అందరూ చూస్తుండగానే ఆ పని చేసిందని గుండు కొట్టించిన తండ్రి

230

తన కుమార్తె ఎవరితోనో మాట్లాడుతూ ఉందన్న ఆగ్రహం ఆ తండ్రి వివేకాన్ని కోల్పోయేలా చేసింది. ఆమెను దారుణంగా కొట్టడంతో పాటు నడి వీధిలోకి లాక్కొచ్చి, హింసించి, ఆమెకు గుండు గీయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ సమీపంలో జరుగగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

వివరాల్లోకి వెళితే, ఓ మైనర్ బాలిక, తనకు తెలిసిన యువకుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న బిడ్డని, అసలు ఏమైందో తెలుసుకోవాలని కూడా ఆలోచించకుండా, తప్పు చేస్తున్నావంటూ, ఆమెను హింసించారు. విపరీతంగా కొట్టి, నడిరోడ్డుపైకి లాక్కొచ్చారు.ఇకపై ఆ అబ్బాయితో మాట్లాడనని, తనను క్షమించాలని ఆమె వేడుకుంది. అయినా కనికరం లేకుండా నలుగురూ చూస్తుండగా, గుండు కొట్టించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. వీడియోను చూసి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation