ఆటో డ్రైవరుతో ప్రేమ, ఇంటి నుంచి పారిపోయిన బాలిక…

110

అతి చిన్న వయసులో ప్రేమ..అంటే టీనేజ్ లవ్ అఫైర్. ఇలాంటి ప్రేమ ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది. ఈ వయస్సులో ముందు..వెనుకా చూడరు. ఆ వయసులో కలిగే ప్రేమే శాశ్వతం, అదే జీవితం అని అనుకుంటుంటారు. టీనేజ్‌లో కలిగే ప్రేమలో ఇరువురూ భావుకులైపోతుంటారు. ఆ భావుకత ఎలా ఉంటుందంటే వారు ఊహించిందే నిజమైన ప్రేమగా, తమ ప్రేమకు కారకులైన వారే వారి జీవిత భాగస్వామిగా ఊహించుకుని వారికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. ఇలా చిన్న వయసులో ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో. అలా తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ మోజులో పడిన బాలిక ప్రియుడితో కలిసి పరారైన ఘటన విజయవాడ నగరంలో జరిగింది.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంకు చెందిన ఒక బాలిక తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ మధ్యనే ఆమె ఒక ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. డైలీ స్కూల్ కు వెళ్ళేటప్పుడు అతని ఆటోనే ఎక్కుతుంది. అదే టైమ్ లో ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమలో దించాడు ఆటో డ్రైవర్. ఇక ఈ మధ్య ఆ అమ్మాయి చేతికి సెల్‌ఫోన్‌ కూడా రావడంతో, రోజుల తరబడి అతడితో ఛాటింగ్ చేస్తూ చదువును పట్టించుకోవడం మానేసింది. అయితే పెళ్లి చేసుకుందాం, ఇంట్లో చెప్పు అని ఆ ఆటో డ్రైవర్ చెప్పడంతో, నెల రోజుల క్రితం తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు షాకయ్యారు. తెలిసీతెలియని వయస్సులో ప్రేమేంటని చీవాట్లు పెట్టారు. పిచ్చి చేష్టలు మానుకుని బుద్ధిగా చదువుకోవాలని సూచించారు. అయినా ఆమెలో మార్పు కనిపించకపోవడంతో విజయవాడ భవానీపురంలో ఉండే మేనత్త వద్దకు ఈ నెల 19న బాలికను పంపారు. కూతురితో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ ఆమె వద్దే ఉంచారు. దీంతో బాలిక మళ్లీ మేనత్త ఇంటి నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఇంటి మేడ పైకి వెళ్లి అతనితో గంటలసేపు మాట్లాడేది.

Image result for ఆటో డ్రైవరుతో ప్రేమ,

ఇక మన పెళ్ళికి ఒప్పుకోరు అని అమ్మాయి చెప్పడంతో ఎక్కడికైనా పారిపోదాం అని ఆ ఆటో డ్రైవర్ చెప్పడంతో, ఎవరికీ చెప్పకుండా అతనితో వెళ్ళిపోయింది. నిన్న మేనత్త పనిమీద బయటకు వెళ్లి కాసేపటి తర్వాత వచ్చింది. ఇంట్లో మేనకోడలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని అడిగింది. బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా బాలికను గుర్తించిన పోలీసులు ప్రేమజంటను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. చిన్న వయస్సులో ప్రేమ వ్యామోహంలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని బాలికకు సూచించి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోసారి బాలికతో మాట్లాడినా, ప్రేమ పేరుతో వేధించినా జైలుకు పంపిస్తామని ఆటోడ్రైవర్‌ను హెచ్చరించి వదిలేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation