ప్రేమకు పరాకాష్ట.. ప్రియుడి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టి సమాధి పక్కనే నిద్రపోతున్న ప్రియురాలు

104

ప్రేమ గుడ్డిది అని కొందరు అంటారు కానీ ప్రేమ అనేది పిచ్చి. కొందరు ప్రేమికులను చుస్తే ఇదే నిజమనిపిస్తుంది. కొందరు ప్రేమికులు ప్రేమించిన వారిని ఏ రేంజ్ లో ప్రేమిస్తారు అంటే వాళ్ళు లేకపోతే ఇక లైఫ్ లేదేమో అనుకునేలా ప్రేమిస్తారు. మరికొందరు అయితే ప్రేమించినవాళ్లు దూరం అయితే వాళ్ళ జ్ఞాపకాలతోనే బతుకుతారు. అలాంటి ఒక ప్రేమజంట కథ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని స్మశానవాటికలో పూడ్చి వేస్తారు కానీ ఇక్కడ మాత్రం చనిపోయిన తన ప్రియున్ని ఏకంగా ఇంట్లోనే పాతిపెట్టి, రెండు నెలలుగా అతడు సమాధి పక్కనే నిద్రపోతుంది ప్రియురాలు. ఈ ఘటన ఎవరికీ తెలియకుండా ఎంతగానో జాగ్రత్త పడింది. ఇక ఆ యువకుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే.. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మధ్యప్రదేశ్ లోని కుసమీ గ్రామంలో జాను సింగ్ అనే యువతి సాత్నా జిల్లాకు చెందిన ఇషాన్ మహమ్మద్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ కొంతకాలం పాటు కామాక్ష్ గ్రామానికి వచ్చి సహజీవనం కూడా చేసారు. కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట మధ్య తరచూ గొడవలు జరగడం మొదలైంది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు ఇషాన్. ఈ క్రమంలోనే అదే నెల 7వ తేదీన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తన ప్రియుడు ఇషాన్ ఉరివేసుకొని చనిపోవడంతో ఏం చేయాలో పాలుపోని ప్రియురాలు జాను సింగ్ ఈ విషయాన్ని అసలు బయటకు పొక్కనివ్వలేదు. ఈ క్రమంలోనే అతడి మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతి పెట్టింది.

ప్రేమకు పరాకాష్ట.. ప్రియుడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి... సమాధి పక్కనే నిద్ర...?

అయితే ఎంతైనా ప్రేమించినవాడు కదా. అతని మరణాన్ని తట్టుకోలేకపోయింది. ప్రియుడి సమాధి పక్కనే రోజు నిద్రించటం మొదలు పెట్టింది జాను సింగ్. మరోవైపు తన కుమారుడు కొన్ని రోజులపాటు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జాను ఇషాన్ ప్రేమికుల అని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ లో తమ మధ్య గొడవ జరిగిందని, దీంతో అతను ఉరి వేసుకున్నాడు అని, ఇషాన్ ఉరివేసుకున్న సమయంలో తాను ఇంట్లో లేనని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు జాను తెలిపింది. అతనితో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నని, అతను చనిపోయాడు అని తెలిస్తే, అతని శవాన్ని తీసుకెళ్లి ఎక్కడో సమాధి చేస్తారు, అందుకే ఈ విషయం బయట పడకుండా నా ఇంట్లోనే సమాధి చేశానని చెప్పింది. ఈమె మాటలు విని పోలీసులు కూడా షాకయ్యారు.. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు పోలీసులు. అతను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? జాను చెప్పే విషయాలు నిజమా అబద్దమా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

Content above bottom navigation