మహిళపై గ్యాంగ్ రేప్.. పాపం నగ్నంగా పరుగెత్తింది

71

ఈ మద్య మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోతున్నాయి. పెద్దా చిన్నా వావి వ‌ర‌స మరిచి చిన్న పిల్లలు, ముదుసలి అన్న తేడా కూడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.నిర్భ‌య ఘ‌ట‌న దిశ ఘ‌ట‌న జ‌రిగి ఆ నీచుల‌కి జైలు శిక్ష ప‌డినా, ఎన్ కౌంట‌ర్ లో ప్రాణాలు కోల్పోయినా, ఉరికంభం ఎక్కే ప‌రిస్దితులు వ‌స్తున్నా, కొంద‌రిలో ఎలాంటి మార్పు రావ‌డం లేదు..దిశ చ‌ట్టం తీసుకువ‌చ్చారు.. గ‌తంలో నిర్భ‌య చ‌ట్టం తీసుకువ‌చ్చారు.. కాని వాటిని కూడా లెక్క చేయ‌డం లేదు..

ఓవైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకుంటున్నాం అంటున్నాయి, కాని మరో వైపు అత్యాచారాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి… ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు కార‌ణం అయితే వారిని ఎన్ కౌంటర్ చేసిన‌ప్పటికీ కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు..మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి ఆమె తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం శూన్యమే అయ్యింది. అయితే తనను అత్యాచారం చేసి చంపే ప్రమాదం ఉందని భయపడిన ఆమె అలాగే నగ్నంగా రెండు వందల మీటర్ల దూరం పరిగెత్తినట్టు తెలుస్తోంది. మహిళను వెంటాడి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని.. చంపేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక అక్కడి కొంత మంది నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. సమాజంలో ప్రతిచోట ఇలాంటి కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారని.. అలాంటి వారిని పోలీసులు కఠినంగా పది మంది ముందే శిక్షించాలని అంటున్నారు. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా ప్రతిచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి..దిశ చ‌ట్టం తీసుకువ‌చ్చినా ఏపీలో ఇలాంటి దుర్మార్గ‌మైన ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు వెంట‌నే వీరిని కూడా ఉరితీయాల‌ని అప్పుడే నిజ‌మైన భ‌యం క‌లుగుతుంది అంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation