కరోనావైరస్ లాక్డౌన్ పుణ్యమా అని టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఇక మరి కొంత మంది యువ హీరోల పెళ్లిళ్లు కూడా త్వరలోనే జరుగడానికి ఏర్పాట్లు మొదలయ్యాయనే వాద్తలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే యువ హీరో శర్వానంద్ పెళ్లికొడుకు కాబోతున్నారనే వార్త బలంగానే వినిపిస్తున్నది. ఇంతకు శర్వానంద్‌కు కాబోయే భార్య ఎవరంటే..
టాలీవుడ్లో ఊహించని విధంగా రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్ అలాంటి హీరోలు బ్రహ్మచారుల జాబితా నుంచి వివాహహితుల జాబితాలోకి చేరిపోయారు. ఇక బ్యాచిలర్స్‌గా మిగిలిపోయిన ప్రుభాస్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి యువ హీరోలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ల గురించి చర్చ జీరుగుతుంటే సడెన్‌గా శర్వానంద్ పెళ్లి తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.