కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టదు. దానికి చిన్నా, పెద్దా అనే తేడాయే ఉండదు. మనం జాగ్రత్తగా ఉండటం తప్పా ఏం చేయలేని పరిస్థితి. అలా కాదు నాకేంటి అనుకుంటే మాత్రం ఏమీ చేయలేం. సీఎం, మంత్రులు, స్టార్ హీరోలు ఇలా ఒక్కరేంటి ఎందరెందరో కరోనా బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ముఖ్యంగా సినీ తారల ఇంట్లోనే చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే బిగ్ బీ, రాజమౌళి వంటి బిగ్గెస్ట్ సెలెబ్రిటీల ఇంట్లో కరోనా తాండవం చేసింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా సోకిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్నా చెప్పుకొచ్చింది.