భాగ్యనగరానికి కొత్త కలెక్టరమ్మ..ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనలో కలెక్టర్ల ప్రాధాన్యత పెంచేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే యువ కలెక్టర్లను అందుకు తగ్గట్లుగా ముఖ్యమైన ప్రాంతాలకు బదీలీలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి కొత్త కలెక్టరమ్మగా శ్వేతా మహంతి వచ్చారు. యువ కలెక్టర్‌గా వనపర్తి జిల్లాలో పనిచేసిన ఆమె బదిలీపై హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన మాణిక్యరాజ్‌ కన్నన్‌ పరిశ్రమల శాఖ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. బదిలీ పై వెళ్లిన మాణిక్యరాజ్‌ కన్నన్‌ నుంచి శ్వేతామహంతి పదవీ బాద్యతలు స్వీకరించారు. అయితే ఈ కొత్త కలెక్టర్ ఎవరు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..అనే విషయాలు తెలుసుకోవాలని భాగ్యనగరవాసులు ఇంటర్ నెట్ లో తెగవెతికేస్తున్నారు.. ఒక్కసారి ఆమె బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్తే..

Image result for శ్వేతామహంతి

2011 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి వనపర్తి జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్‌ చేసి మంచి ఉద్యోగం సాధించి ఆత్మసంతృప్తి కలగక సివిల్స్ వైపు అడుగులు వేసి రెండో ప్రయత్నంలో ఏకంగా ఆల్‌ ఇండియా రెండో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ యువ ఐఏఎస్ తండ్రి ప్రసన్నకుమార్‌ మహంతి కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసి రిటైరయ్యారు. విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. ఐఏఎస్‌కు ఎంపిక కాకముందు ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌గా పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో విధులు నిర్వర్తించారు. సంప్రదాయ నృత్యం ఒడిస్సీ అంటే శ్వేతా మహంతికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నేర్చుకుంది. పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఈమె భర్త రజత్‌కుమార్‌ షైనీ కూడా ఐఏఎస్‌ ఆఫీసరే. వనపర్తి జిలా కలెక్టర్ గా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్ళేది. వనపర్తి, పెబ్బేరు, గోపాల్ పేట్ లలో ఉండే ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి అక్కడ టీచర్లకు పలు సూచనలు చేసేవారు. స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడం వంటి కార్యక్రమాలు చేసేవారు.

ఈ క్రింది వీడియోని చూడండి

అలాగే జిల్లాలో ఎక్కువగా ఉండే మద్యం, సారాయి అమ్మకాలను చాలావరకు తగ్గించారు. ముఖ్యంగా దొంగచాటుగా కాచే సారాయి దుకాణాల మీద తనిఖీలు చేయించి, వాటిని పూర్తీగా మూసివేయించింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూరికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ తీరు బాగాలేదంటూ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు ఏకమై నిరసన బాట పట్టారు. అయినా కూడా ఆమె ఎక్కడ బెదరకుండా తన డ్యూటీ తానూ చేసుకుంటుపోయింది. వనపర్తి జిల్లాకు ఆమె కలెక్టర్ కాకముందు ఒకలా ఉంటె, ఆమె కలెక్టర్ అయ్యాకా మరోలా ఉంది. వనపర్తి జిల్లాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. వనపర్తిలో బాలభవన్‌ను ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా తనదైన శైలిలో సిన్సియర్ అని అనిపించుకున్న ఆమెకు ఇప్పుడు హైదరాబాద్ వంటి ప్లేస్‌లో బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. చదువుకునే రోజుల నుంచే ఎన్‌జీవోలతో కలిసి పనిచేసిన ఆమె ప్రజాసేవ లక్ష్యంగా కలెక్టర్ అయినట్లు పలు సంధర్భాల్లో వెల్లడించింది. హైదరాబాద్ కలెక్టర్ గా ఈమె తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation