హైదరాబాద్ లో దారుణం.. విషం తాగి ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య

149

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక పరిస్థితులు ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. అప్పులు ఉండడంతో, వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో పిల్లలకు విషమిచ్చి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎల్‌బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

హైదరాబాద్ లోని హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ప్రదీప్, తన భార్య స్వాతితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కళ్యాణ్(5), జయకృష్ణ (2) ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి ప్రదీప్, స్వాతి కూడా తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రదీప్‌ స్వస్థలం దేవరకొండ మండలం నెరడుకొమ్మగా గుర్తించారు. వారి కుటుంబానికి సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. కాగా, ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తమకు రూ.40 లక్షల వరకు అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, స్వాతి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని అంటున్నారు. తమ కుమార్తెతో గత ఆదివారం మాట్లాడినట్టు స్వాతి తండ్రి తెలిపారు. తొలుత పిల్లలు, భార్యకు విషమిచ్చిన ప్రదీప్, తర్వాతే తాను సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని పేర్కొంటున్నారు.

Image result for విషం తాగి ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య

ముక్కుపచ్చలారని ఆ చిన్నారులు అమ్మా నాన్నలు ఇచ్చింది విషమని తెలియక దానిని తాగి విగత జీవులయ్యారు. విగత జీవులుగా పడి ఉన్న ఆ చిన్నారులను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation