ఆగష్టు లో ఇండియాలో కరోనా ప్రభావం ఇంత దారుణమా.? ఈ ప్రూఫ్స్ చూస్తే ఇంటినుండి బయటకు రారు

భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 9971 కేసులు నమోదు కాగా, 287 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,46,628 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,20,406 ఉండగా, 1,19,292 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 6929 మంది వ్యాధితో మరణించారు.

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,42,069. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 46,66,386. భారత్ లో 48.02 గా కరోనా రికవరీ రేటు.

మహారాష్ట్రలో అత్యధికంగా 82968 కేసులు నమోదు కాగా 2969 మంది మృతి చెందారు. తమిళనాడులో 30,152 కేసులు నమోదు, 251 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 27,654 పాజిటివ్ కేసులు, 761 మంది మరణించారు

Content above bottom navigation