టిక్‌టాక్‌ లో హాట్‌హాట్ వీడియోలతో అమర సైనికుడి భార్య, యువకులతో బూతుపురాణం..

117

ఆమె భర్త ఒక ఆర్మీ ఆఫీసర్. ఈ మధ్యనే దేశ రక్షణలో ప్రాణాలను అర్పించాడు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. భర్త చనిపోవడంతో బిడ్డతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. అయితే కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆమె ఈమధ్య కట్టుబాట్లను తప్పింది. టిక్‌టాక్‌ కు బానిసై యువకులను రెచ్చగొడుతూ వీడియోలు తీసి అందరితోనూ ఛీ అనిపించుకుంటోంది. టిక్‌టాక్‌ లో హాట్‌హాట్ వీడియోలతో, అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చిపోతోంది. ఆమె ప్రవర్తనతో తమ ఊరి పరువు పోతోందంటూ గ్రామస్థులు రోడ్డుకెక్కడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని తేని జిల్లా నాగలాపురం గ్రామంలో సుగంతి అనే మహిళ భర్త ఆర్మీలో పని చేస్తూ అమరుడయ్యాడు. దాంతో తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఆమెకు ఇటీవల టిక్‌టాక్‌ పిచ్చి పట్టడంతో రోజూ పదుల సంఖ్యలో వీడియోలు తీస్తూ పోస్ట్ చేస్తుంటుంది. ఆమెది చిన్న వయసే కావడం, మేకప్‌లో అందంగా కనిపించడంతో యువకులు ఆమె వీడియోలకు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన సుగంతి నడుము కనిపించేలా చీర కట్టుకుని కుర్రాళ్లను రెచ్చగొట్టేలా డ్యాన్సులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది.. ఈ వీడియోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది యువకులు ఆమెతో టచ్‌ లోకి వచ్చారు. ఫోన్ నంబర్ తెలుసుకుని నీ భర్త లేడు కదా.. మాతో ఎంజాయ్ చేయ్ అంటూ అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో సుగంతి వారిని రాయలేని భాషలో బూతులు తిట్టేది. దీంతో మరింత రెచ్చిపోయిన యువకులు నువ్వేంటే అందరికీ తెలుసు.. నీతో పాటు మీ ఊరి ఆడవాళ్లందరూ అలాంటి వారే అంటూ తిట్టారు. సుగంతితో ఫోన్ లో మాట్లాడిన ఆ యవకులు ఆ సంభాషణను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఆడియో వైరల్‌ గా మారింది.

అది విన్న నాగలాపురం గ్రామస్థులు పరువు తీస్తోదంటూ సుగంతిపై మండిపడుతున్నారు. ఆమె వల్ల గ్రామ మహిళలందరూ అలాంటి వారేనని ఇతర ప్రాంతాల వారు అనుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే ఆమెను ఊరు విడిచి వెళ్లాలని ఒత్తిడి చేయగా ఆమె ససేమిరా అంది. ఎవరేం చేసినా తాను సొంతూరు విడిచి వెళ్లనని తేల్చి చెప్పింది. ఆమె తీరుతో విసిగిపోయిన గ్రామస్థులు శనివారం పళనిచెట్టిపట్టి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సుగంతిని ఊరి నుంచి పంపించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సుగంతికి సహకరిస్తున్న నాగజ్యోతి అనే మహిళను కూడా గ్రామం నుంచి బహిష్కరించాలని వేడుకున్నారు. భర్త లేని ఒంటరి మహిళ అని జాలి చూపిస్తే సుగంతి గ్రామ పరువును బజారుకు ఈడుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో సుగంతిపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయం తెలిసింది. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన టిక్‌టాక్ ఫ్రెండ్‌ ని హత్య చేసేందుకు ఆమె ప్లాన్ వేసిందని వెల్లడి కావడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఆమెపై మరింత లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Content above bottom navigation