కోరికలు ఎక్కువై కొడుకుని వదిలేసి లేచిపోయిన న్యూటన్ తల్లి

771

మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన “సర్ ఐజాక్ న్యూటన్” ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికి గానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను “సైన్సు పితామహుడు” గా కీర్తించింది. ఆధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన ఈ మహనీయుడి జీవితం గురించి కొన్ని ముఖ్య విషయాలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for న్యూటన్ తల్లి

ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643 లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన వూల్ థోర్ప్ మానార్ అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ జన్మించే సమయానికి ఇంగ్లండు ప్రపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం వలన ఆయన పుట్టినరోజు డిసెంబరు 25, 1642 గా రికార్డ్ అయ్యింది. తండ్రి చనిపోయిన మూడు నెలలకు న్యూటన్ జన్మించాడు. నెలలు నిండక ముందే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ జన్మించిన సమయంలో చాలా తక్కువ బరువు, బలహీనంగా ఉండేవాడు. చూసిన వాళ్లంతా అసలీ శిశువు బ్రతుకుతాడా అనుకున్నారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద 3 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తరువాత న్యూటన్ 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ పెళ్లి చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి, తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగటం జరిగింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించేవాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇతనికి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఇతని పినతండ్రి కూడా చనిపోయాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

న్యూటన్ బాల్యంలో ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎవరితో గడపకుండా ఆలోచనలో ఉండేవాడు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడు వ్యవసాయం పనులు చేస్తూ బొమ్మలు గీస్తూ కవితలు రాస్తూ ఉండేవాడు. అంతేకాకుండా నీటితో నడిచే గడియారాన్ని చిన్నతనంలోనే తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి. తర్వాత కేంబ్రిడ్జి ట్రినిటీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే అక్కడ పనిచేసే ఆచార్యులకే సులువైన పద్దతిలో గణిత సూత్రాలు చెప్పే స్థాయికి న్యూటన్ ఎదిగాడు. గణితం ఆయనకు ఆటవిడుపుగా ఉండేది. తన గణిత ప్రొఫెసర్ ఐజాక్ చారోతో సన్నిహితంగా ఉండేవాడు. ఆయన న్యూటన్ లో ఉన్న టాలెంట్ గుర్తించి ప్రోత్సహించాడు. ఐజాక్ చారో ఇచ్చిన సహకారంతో 1665 లో న్యూటన్ బైనామియల్ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత యాపిల్ పండు కింద ఎలా పడిందో అన్న విషయం మీద ఆసక్తి కనబరచి, విశ్వగురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నాడు. న్యూటన్ కాంతి లక్షణాల మీద పరిశోధనలు చేసి, ఇంద్రధనస్సు రంగులను వెదజల్లుతుందని కనిపెట్టాడు. 1670 లో న్యూటన్ పరవర్తన దూరదర్శినిని తయారుచేశాడు. ఇలా ఎన్నో విషయాలను న్యూటన్ కనుగొన్నాడు. ఇవేనండి న్యూటన్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య విషయాలు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation