కర్నూలు జిల్లాలో కరోనా కల్లోలం… ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు

123

కర్నూలు జిల్లా ప్రజలను ఈ వైర‌స్ మహమ్మారి గజగజా వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ఉలిక్కిపడింది. మార్చి నెల 4న మూడు కేసులు నమోదు కాగా నిన్న ఎవరూ ఊహించని విధంగా 52 కేసులు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో 56 మందికి ఈ వ్యాది నిర్ధారణ అయింది. వీరిలో 55 మంది ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన వారే కావడం గమనార్హం. ఒకేసారి 52 కొత్త కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Coronavirus in J&K: Patients responding well to treatment, say doctors

అధికారులు ఇప్పటివరకు 463 నమూనాలను అనంతపురం, తిరుపతి ల్యాబ్ లకు పంపగా వాటిలో 307 ఫలితాలు వచ్చాయి. ఇంకా 156 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 8 అసెంబ్లీ నియోజవర్గాల్లో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువగా కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. కర్నూలుకోని ప్రకాష్ నగర్, రోజా వీధి, శ్రీ లక్ష్మీ నగర్, గఫార్ స్ట్రీట్, కేవీఆర్ గార్డెన్స్, పార్క్ రోడ్, బుధవారపేట, నాగప్పవీధితో పాటు మరో ఏడు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

నంద్యాలలో సలీం నగర్, నీలి స్ట్రీట్, దేవ నగర్, మరో ఏడు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కోడుమూరులోని చాకలి వీధి, మోమిన్ స్ట్రీట్ లో పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆత్మకూరులోని కినాస్ సింగ్ నగర్ లో కరోనా నిర్ధారణ అయింది. ఒక్కరోజే 52 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు పాజిటివ్ అయిన వ్యక్తులను ఎవరెవరు కలిశారనే వివరాలను సేకరించారు.పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం యువతే ఉండటం గమనార్హం. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను బఫర్ జోన్ గా పరిగణించి ఎవరూ బయట తిరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కేసులు నమోదైన ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు.

Content above bottom navigation