ప్రేమించి పెళ్లి చేసుకోని, తాళికట్టిన 12 గంటల్లోనే వదిలేసింది.. ఈ ప్రేమకథలో ఎన్నో ట్విస్టులు..

165

మనం తీసుకునే నిర్ణయాలే మన లైఫ్ ను డిసైడ్ చేస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ బాగుంటుంది. లేదంటే మన లైఫ్ గందరగోళంగా మారుతుంది. కొందరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి తీసుకున్న నిర్ణయాన్నే మళ్లీ మార్చేసుకుని గందరగోళానికి గురవ్వుతూ ఉంటారు. వారి మనసు ఎప్పుడు ఎలా మారుతుందనేది వారికే తెలియదు. ఇక వాళ్లతో కలిసి ఉండేవారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రేమకథలో కూడా ఒక యువతి పరిస్థితి అలాగే ఉంది. ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల తన ప్రేమకథలో తానే విలన్‌గా మారింది. అసలేమైందంటే..

ఈ క్రింది వీడియో చుడండి

ఉత్తరప్రదేశ్‌లోని హమీపూర్ జిల్లాలోని గల మౌదాహాలో నివసిస్తున్న సంధ్య తన క్లాస్‌మేట్ సందీప్‌ ను ప్రేమించింది. వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి డేటింగులో ఉన్నారు. ఇంట్లోవారికి తెలియకుండా కొన్నాళ్లు బాగానే ప్రేమకథ నడిపించారు. కానీ ఈ మధ్యనే ఇంట్లో వాళ్లకు దొరికిపోయారు. దీంతో సంధ్య తల్లిదండ్రులు ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని మర్చిపోమని సంధ్యకు చెప్పారు. కానీ నేను అతనిని మర్చిపోలేనని సంధ్య చెప్పింది. దాంతో సందీప్‌ ను చిక్కుల్లో పడేయాలని ప్లాన్ చేశారు సంధ్య కుటుంబ సభ్యులు. సంధ్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లిదండ్రులు.. అతడు తన కూతురిని లైంగికంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. అలా కేసు పెట్టడానికి ముందు సంధ్య ఒప్పుకోలేదు కానీ కుటుంబ సభ్యులు బలవంతంగా సందీప్‌ పై ఫిర్యాదు చేయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సందీప్‌ ను అదుపులోకి తీసుకున్నారు. సందీప్ అరెస్టయ్యాడనే విషయం తెలియగానే సంధ్య మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అతడిపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అనంతరం సందీప్ తల్లిదండ్రులను కలిసి.. తన ఇంట్లోవాళ్లు బలవంతంగా ఈ కేసు పెట్టించారని తెలిపింది. తమకు వెంటనే పెళ్లి చేయాలని కోరింది. దీంతో సందీప్ తల్లిదండ్రులు ఆమెతో పెళ్లికి అంగీకరించారు.

Image result for తాళికట్టిన 12 గంటల్లోనే వదిలేసింది

సందీప్ తల్లిదండ్రులు ఇద్దరికీ గుడిలో పెళ్లి చేశారు. పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సంధ్య ఏమనుకుందో ఏమో.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పెళ్లైన 12 గంటల తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, విడిపోవాలని అనుకుంటున్నా అని తెలిపింది. దీంతో పోలీసులు సందీప్ నిర్ణయాన్ని అడిగారు. ఆమె నిర్ణయానికి సందీప్ అడ్డు చెప్పలేదు. విడిపోవడానికి తాను సిద్ధమేనని తెలిపాడు. దీంతో పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా సందీప్ ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘‘స్థిరత్వం లేని ఆమె మనసుతో విసిగిపోయాను. ఆమెను ఎంతగానో ప్రేమించా. కానీ, ఆమెకు ఏం కావాలనేది ఆమెకే తెలియదు. అందుకే, ఆమెను విడిపోవడానికి సంతోషంగా అంగీకరించా. ఇక తనను జీవితంలో కలవను అని తెలిపాడు. చూశారుగా స్థిరత్వం లేని యువతీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని అందరిని ఇబ్బంది పెట్టిందో.. తన స్థిరత్వం లేని మనస్తత్వం వలన ప్రేమించిన వాడిని ఎలా దూరం చేసుకుందో..

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation