ఘోర రోడ్డు ప్రమాదం నదిలో పడ్డ బస్సు ఎంతమంది చనిపోయారో తెలిస్తే కన్నీళ్ళే

130

ఈ మధ్య వరుసగా ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా ప్రజ్నాపూర్, కరీంనగర్ జిల్లా మానుకొండూరు. కర్ణాటక రాష్టం ఉడిపి… ప్రాంతమేదైనా, కారణమేదైనా రహదారులు మాత్రం రక్తాన్ని చిందిస్తున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపటం, రహదారుల రూల్స్ పాటించకపోవటం వంటి పలు కారణాలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో అమాయకులు కూడా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళి అలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే ఒకటి చోటుచేసుకుంది.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బస్సు నదిలో బోల్తా పడటంతో 24 మంది దుర్మరణం చెందారని సమాచారం. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా బుండి జిల్లాలోని లఖేరీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు అదుపు తప్పి మెజ్ నదిలోకి దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కోటా లాల్సాత్ మెగా హైవే పైన ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని సమాచారం. కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ వెళ్తుండగా..

బుధవారం ఉదయం 10 గంటల సమయంలో నదిలో బస్సు పడిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న మరికొంత మందిని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image result for నదిలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

ఇక ఈ ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడినవారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌ కు సూచించారు. నదిలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఇక 2017 డిసెంబర్ లో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని దుబిలో బస్సు బ్రిడ్జి మీది నుంచి నదిలో పడిపోవడంతో 12 మంది చనిపోగా 24 మంది గాయపడ్డారు.

Content above bottom navigation