అమృత సంచలన నిర్ణయం.. తల్లి దగ్గరకు వెళ్తుందా?

173

మిర్యాలగూడలో మారుతీరావు ఘటన ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మన అందరికి తెలుసు. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం భరించలేని తండ్రి కూతురి ఎదుటే అల్లుడిని దారుణంగా చంపించాడు. దాని మూలంగా 7 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూతురికి రాయబారాలు కూడా పంపాడు. కానీ ఆ రాయబారాలు ఫలించలేదు. దాంతో కేసులన్ని మీదకు వచ్చాయి. ఒకవైపు కూతురు రాలేదనే భాద, మరొకపక్కన కేసులు వెంటాడుతున్నాయి. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని మారుతీరావు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న ముందు ఒక లేఖను కూడా రాసారు. కాగా ఆ లేఖలో తన భార్య ని క్షమించమని కోరుతూ, తన కూతురుని వాళ్ళ అమ్మ వద్దకు వెళ్ళమని కోరుకున్నారు.

Image result for amurtha and sravan

అయితే తన భర్తని చంపాడన్న కోపంతో, తన తండ్రి మారుతీరావు మీద కక్షతో రగిలిపోతున్న అమృత, తన తండ్రి మరణ వార్త తెలుసుకున్నాక కూడా పెద్దగా బాధపడలేదనే చెప్పాలి. అంతేకాకుండా తన భర్త ప్రణయ్ ను చంపేశాడనే పశ్చాత్తాపంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని పలు సంచలన వాఖ్యలు చేసింది అమృత. అయితే తండ్రి మాటను కాదనలేక, ఆ సమయంలో తల్లికి తోడుగా ఉండాలని వెళ్ళింది అమృత. కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆమెను రానివ్వలేదు. గో బ్యాక్ అమృత అంటూ పెద్ద ఎత్తున నిరసన చేశారు. దాంతో అమృత వెనుతిరగాల్సి వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇకపోతే అసలు విషయం ఏంటంటే… భర్త లేకుండా ఒంటరి జీవితాన్ని గడపే నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన అమృత, అలాంటి పరిస్థితుల నుండి తన తల్లిని దూరం చేసి, తన తల్లికి అండగా నిలవడానికి సిద్ధమైందని సమాచారం. తన భర్తను చంపింది మారుతీరావు. ఇందులో తన తల్లి గిరిజాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఎలాంటి తప్పు చెయ్యలేదు. కానీ ఇప్పుడు మారుతీరావు సూసైడ్ చేసుకోవడంతో అమృత తల్లి ఒంటరి అయ్యింది. బంధువులు ఉన్నా, ఎన్ని రోజులు అని ఆమె దగ్గర ఉంటారు .ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. దాంతో గిరిజ ఒంటరి అవుతుంది. కాబట్టి అమృత బ్రతికినంత కాలం తన తల్లికి తోడుగా ఉందామని భావిస్తుందంట. అయితే ప్రెస్ మీట్ లో మారుతీరావు ఇంటికి నేను వెళ్ళను కానీ మా అమ్మ నా దగ్గరకు వస్తా అంటే నేను వద్దని చెప్పను. ఆమెను సంతోషంగా నా దగ్గర ఉంచుకుంటా అని అమృత చెప్పింది. అయితే భర్త మృతదేహాన్ని చూడటానికి అమృత వస్తా అంటేనే వద్దని చెప్పిన గిరిజ అమృత దగ్గరకు వెళ్తుందా అనేది పెద్ద సందేహంగా మారింది. తన భర్తను జైలుకు పంపింది. ఇప్పుడు తన భర్త చావుకు కారణమయ్యింది. అలాంటి కూతురి దగ్గరకు గిరిజ వెళ్ళదని అందరు అనుకుంటున్నారు. ఒకవేళ వెళ్తే అందరిని వదిలేసి వెళ్ళాలి. ఎందుకంటే మారుతిరావును, శ్రవణ్ ను జైలుకు పంపింది అమృత. దాంతో అమృత మీద మారుతీరావు కుటుంబం మొత్తం కోపంగా ఉంది. కాబట్టి గిరిజ కూతురి దగ్గరకు వెళ్తే, మారుతీరావు కుటుంబం మొత్తం గిరిజను కూడా దూరం పెడతారు. కాబట్టి గిరిజ వెళ్ళదని అందరు అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation