స్పృహ తప్పి పడిపోయిన అమృత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

142

మిర్యాలగూడ మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లోని గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులందరు కూడా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. మారుతీ రావు ఆత్మహత్యతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి మృతదేహాన్ని చూడటానికి అమృత వెళ్ళింది. కానీ కానీ కుటుంబ సభ్యులు ఆమెను మృతదేహం వద్దకు రానివ్వలేదు. అనంతరం అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో ఆమె తన తండ్రి భౌతిక కాయాన్ని చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత ఆమె తన ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు అమృత మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో అమృత ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలు మాట్లాడారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయినా కూడా కొన్ని ఛానెళ్ల మీడియా ప్రతినిధులు ఆమె వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళ్లి, ముఖాముఖి నిర్వహించారు. ఆ క్రమంలో ఒక ఛానెల్ కు ఇంటర్యూ ఇస్తున్న సమయంలో అనుకోకుండా అమృత స్మృహ తప్పి కింద పడిపోయింది. మిర్యాలగూడలోని తన ఇంట్లో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ ఛానెల్‌ ప్రతినిధితో అమృత మాట్లాడుతూ.. ‘‘మారుతీరావును నేను ఏమన్నా చంపానా?’’ అని ప్రశ్నించారు. తండ్రి మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో స్పందించిన అమృత.. ‘‘నా బాబును చూస్తాను అని మా అమ్మ వస్తానంది. నా భర్తను చంపించి పిల్లాడ్ని చూస్తానంటే ఎలా నమ్మేది. నా భర్త ప్రణయ్‌ ను చంపింది ఎనిమిది మంది దుండగులు. మారుతీరావు కాకుండా ఇంకా ఏడుగురు నిందితులు వారిలో ఉన్నారు. నా భర్తను చంపి, నన్ను ఒంటరిదానిని చేసి, ఇప్పుడు వాళ్ళ కోసం నన్ను దగ్గరకు చేర్చుకోవాలని అనుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అమృత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మీడియా వాళ్ళు వెంటవెంటనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆమె సమాధానం చెప్పలేకపోయింది.

మీడియా అంటున్న మాటలు, సమాజంలో అందరు ఆమెను విలన్ గా చూడటం, తండ్రి ఆత్మహత్య ఘటన..ఇవన్నీ కూడా అలోచించి అలోచించి ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమృతకు ఎలాంటి ప్రమాదం లేదు. ఆమె కోలుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక అంతకముందు కూడా అమృత తల్లి గిరిజా కూడా స్పృహ తప్పి కింద పడిపోయింది. మారుతీరావు శవం వద్ద ఏడుస్తూ ఆమె కింద పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఆమెకు చికిత్స చేశాడు. ఆమెను ఓదార్చేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు చేతులతో తల బాదుకుంటూ ఆమె ఏడ్వడం అందరినీ కలత పెట్టింది. మారుతీ రావు ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు అద్దెకు తీసుకున్న ఆర్యవైశ్య భవన్ లోని గదిలో ఓ గ్లాసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation