మారుతీరావు అన్న కూడా ఆత్మహత్య కారణం తెలిస్తే కన్నీళ్ళే

138

మారుతీరావు ఆత్మహత్యతో ఒక్కసారిగా అమృత, ప్రణయ్‌ ప్రేమకథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మిర్యాల గూడ ప్రాంతానికి చెందిన అమృత.. ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో తన కులం వాడు కాదన్న కారణంతో పాటు ఆస్తి, అంతస్తులు సరితూగకపోవడంతో ప్రణయ్‌ని హత్య చేయించారు మారుతీరావు. నిండు గర్భిణిగా ఉన్న కూతురు అమృత కళ్ల ముందే అత్యంత దారుణంగా కిరాయి హంతకులు ప్రణయ్‌ని నరికిచంపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు జైలుకి వెళ్లి ఇటీవలే బెయిల్‌పై తిరిగి వచ్చారు. అమృత మగబిడ్డకు జన్మనిచ్చి అత్తింట్లోనే ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఈ కేసుపై తీర్పువెలువడే అవకాశం ఉంటుండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. నిన్న అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత అమృత, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే మారుతీరావు కుటుంబానికి సంబంధించి ఒక వార్త బయటపడింది. అదేమిటి అంటే.. మారుతీరావు కంటే ముందు ఆయన అన్నయ్య నాగేందర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారంట. అయితే అది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. 1987 లో జరిగింది. నాగేందర్ 1987లో విజయవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. 32 ఏళ్ల తర్వాత ఆయన సోదరుడైన మారుతీ రావు కూడా ఇదే తరహాలో వేరే ఊళ్లో ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. అప్పుడు అన్నయ్య, ఇప్పుడు తమ్ముడు ఇద్దరూ సొంతూరుకి దూరంగా ఆత్మహత్యకు పాల్పడటంతో బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. నాగేందర్ సివిల్ సప్లయ్ సబ్ కాంట్రాక్టర్గా పనిచేశారు. ఆయన మరణం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం కాగా.. పోలీసులు విచారణ జరిపి ఆత్మహత్యగా నిర్ధారించారని తెలుస్తోంది.

మరోవైపు మారుతీరావు మృతి మిస్టరీగా మారింది. ఆయన మృతిపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. ఆయనది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక అతను ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లేమీ గదిలో లభించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నా, అందుకు సంబంధించిన ఆధారం దొరక్కపోవటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. ఆర్యవైశ్య భవన్ లోని రూంలోకి వెళ్లిన తర్వాత గారెలు తెప్పించుకు తిన్న మారుతిరావు, కాసేపటికే వాంతులు చేసుకున్నట్లుగా బెడ్ పక్కన ఉన్న రక్తపు వాంతుల్ని చూస్తే అర్థమవుతుంది. గారెలలో విషం కలిసింది అని డాక్టర్స్ తేల్చేశారు. అయితే ఆయన తెచ్చుకున్న విషం బాటిల్ ఏమైంది. దానికి సంబంధించిన బాటిల్ కానీ ప్యాకెట్ కానీ దొరకలేదు. ఆ బాటిల్ ఎక్కడ ఉంది అన్నది మరో ప్రశ్న తలెత్తుతుంది. విషం తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారన్న దానికి తగ్గ ఆధారం లభించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation