భర్త చనిపోయాక మారుతీరావు భార్య పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు

141

మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమ ఒకరిని చంపేలా చేసింది. తానూ చనిపోయేలా చేసింది. కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందన్న బాధలో అల్లుడిని చంపాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిస్థితుల వలన ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాడు. కూతురి భర్తను చంపి, ఆమెను విధవను చేశానన్న బాధతో ఇన్ని రోజులు మారుతీరావు ఎంతాగానమో కృంగిపోయాడు. భర్త చనిపోయినా కూడా అమృత తమ వద్దకు రాకపోతుండడంతో, తీవ్ర మనోవేదనకు గురయ్యాడు మారుతీ రావు. కూతురు వద్దకు ఎన్నిసార్లు రాయబారాలు పంపినా కూడా ఆమె వినకపోవడం, ఆయనను మరింత కృంగదీసి డిప్రెషన్ కి గురి చేసింది. ఈలోగా ప్రణయ్ హత్యా కేసు హియరింగ్ కి కూడా వస్తుండడంతో ఆయన మరింతగా కృంగిపోయాడు. తాను ఏ కూతురి కోసమైతే ఇదంతా చేసానో, ఆ కూతురే లేనప్పుడు ఈ జీవితం ఇంకా ఎందుకు అని నిశ్చయించుకున్నాడెమో ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు ఆత్మహత్య వలన ఎక్కువగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే అది మారుతీరావు భార్య గిరిజ అనే చెప్పుకోవాలి.

ఈ క్రింది వీడియో చూడండి

అమృత కుటుంబాన్ని వదిలేసి అత్తామామలతో ఉంది. మారుతీరావు ఈ లోకాన్ని వీడి పరలోకానికి వెళ్ళిపోయాడు. దీంతో గిరిజ ఒంటరిది అయ్యింది. ఇటు కూతురు దూరమై, అటు కట్టుకున్న భర్త దూరమై ఏం చేయాలో అర్థంకాక, ఎవరికోసం జీవించాలనే నైరాశ్యంలో బ్రతుకుతుంది ఆమె. ఒక పక్క చూస్తేనేమో ఏడాదిన్నర కింద కన్న కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయి మోసం చేసిందనే బాధ, మరో పక్కన జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన తాళి కట్టిన భర్త ఆత్మహత్య చేసుకుని పోయాడనే బాధ. ఇలా ఇద్దరు కూడా ఆమె నుండి దూరమయ్యారని, ఆమె పడుతున్న బాధ చూస్తుంటే ఎంతటి దుర్మార్గుడికి అయినా గుండె తరుక్కుపోవడం ఖాయం. ఇద్దరు తమ దారిని వారు చూసుకుంటే, దోషి కాకపోయినప్పటికీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం ముమ్మాటికీ ఆమెనే. ఎవరెవరో చేసిన తప్పుకు ఇప్పుడు ఆమె శిక్ష అనుభవిస్తుంది.

Image result for మారుతీరావు భార్య

ఇప్పుడు రాష్టం అంతటా కూడా గిరిజ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె ఏడుస్తుంటే చూసి తట్టుకోవడం ఎవరి వల్ల అవ్వడం లేదు. మీడియా ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె అన్న మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. భర్త లేడు, కూతురు లేదు..ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి అని ఆమె అన్న మాటలు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు చెమర్చేలా చేశాయి. భర్త తోడులేక, కన్న కూతురు చెంతన లేక ఆమె ఇప్పుడు ఒంటరిదై పోవాల్సిందేనా అనే ప్రశ్న ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. బహుశా తాను మరణించిన తరువాత అయినా, అమృత తిరిగి వస్తుందేమో అని మారుతీరావు భావించి ఉంటాడు, అందుకే సూసైడ్ నోట్ లో అమ్మ దగ్గరకు వెళ్ళు అమృత అని రాసాడు. ఇప్పుడు తల్లి ఒంటరిదైపోయిందనైనా అమృత ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని అందరు అనుకుంటున్నారు. అయితే అమృత ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు బట్టి చుస్తే ఆమె తల్లి దగ్గరకు వచ్చేలా కనిపించడం లేదు. ఒక తండ్రి, ఒక కూతురు చేసిన తప్పుకు ఇప్పుడు ఒక తల్లి అనాధ అయ్యింది. ఆమె పడుతున్న బాధను ఎవరు కూడా తీర్చలేనిది. ఆమెకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation