మారుతీరావు వీలునామా.. ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద రాసాడో చూసి షాకైన పోలీసులు

157

2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మారుతీరావు సంపాదించిన వందల కోట్ల ఆస్తి పంపకమే ఆయన ఆత్మహత్యకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. వీలునామా విషయంలో సోదరుడు శ్రావణ్ తో విభేదాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో మారుతీరావు వీలునామా బయటపడింది.

ఈ క్రింది వీడియో చూడండి

మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేడు కోర్టులో ప్రణయ్ హత్య కేసు విచారణ జరుగనుండగా, చార్జ్ షీట్ కు అదనంగా ఈ వీలునామా పత్రాల కాపీలను పోలీసులు జత చేయనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మరణించడంతో, అతని పేరును తొలగించి, మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు. కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఆయన ఒక్క పైసా ఆస్తి కూడా రాయలేదు. గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తరువాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీరావు తన కుమార్తె పేరిటే రాసినట్టుగా ప్రచారం జరిగింది. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో మారుతీరావు కొద్ది రోజుల కిందట వీలునామా మార్చడానికి సంబంధించిన పలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అమృత భర్త అయిన ప్రణయ్ హత్యకు ముందే మారుతీరావు తనకు ఉన్న ఆస్తినంతా తన సొదరుడు పేరుపైనే వీలునామా రాశారు. అయితే ఇటీవల ఈ వీలునామా మార్చి తిరగరాశారు. బెయిల్ పై ఆరు నెలల తర్వాత వచ్చిన మారుతీరావుతో ఆయనకు చెందిన బంధువులు, సోదరులు గొడవపడినట్లు సమాచారం. మారుతీరావు వలన తమ పరువు పోయింది. తమ పిల్లలకు పెళ్ళిల్లు కావడం లేదు. అని ఇలా పలు విధాలుగా కుటుంబ సభ్యులు, బంధువులు అతనితో గొడవ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కుటుంబ, బంధువులతో వివాదాలు.. మరో వైపు ప్రణయ్ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాస్తవాలు ఏమిటని పోలీసుల విచారణలో తేలనున్నది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation