టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కు గుండెపోటు పరిస్థతి విషమం

106

అసలే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య వరస విషాదాలు జరుగుతున్నాయి. ఓ వైపు కరోనా కాటేస్తుండగానే మరోవైపు ఇండస్ట్రీలో కూడా చేదువార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఈయన చాలా సీనియర్.. తెలుగులో సినిమాలతో పాటు సీరియల్స్‌కు కూడా మ్యూజిక్ అందించాడు. జూన్ 4 ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఐసియులో ఉన్నాడు.


సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటు సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటుఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్లు చెప్తున్నారు శశి ప్రీతమ్ సన్నిహితులు. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ సినిమాతో సింగర్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు.

ఆ తర్వాత 21 తెలుగు సినిమాలతో పాటు అరడజన్ హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించాడు శశి ప్రీతమ్. వీడియో డాక్యుమెంటరీలు, యాడ్స్, సీరియల్స్ కూడా చేసారు ఈయన. శశి ప్రీతమ్ ఆరోగ్యం మెరుగుపడాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Content above bottom navigation