చీ..చీ.. దారుణం.. పెళ్లి పేరుతో నర్సును న‌మ్మించిన కీచక కానిస్టే

ఇటీవ‌ల కాలంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మహిళలకు రక్షణ కరువైంది. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది.

Image result for girls harassment

ఇక‌ విచిత్రం ఏమిటంటే ఏపీలో మహిళలలపై అత్యాచారాలు చేసిన వారిపై కఠినంగా చర్చించేందుకు దిశ చట్టానికి సవణలు తెచ్చి అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన రోజే… ఏపీలో రెండు, హైదరాబాద్‌లో ఒక అత్యాచార కేసు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా యువతిని ప్రేమించినట్లు నటించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ విభాగం ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన పల్లె గురువయ్య (30)కు రెండేళ్ల క్రితం నగరంలో నర్సింగ్‌ కోర్సు చదువుతున్న యువతి(19) పరిచయమైంది. ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారి చ‌ట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగారు. అయితే గురవయ్యకు ఇటీవల ఇంట్లో వాళ్లు మరో యువతిని వివాహం నిశ్చయించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

దీంతో స‌ద‌రు యువ‌తి గుర‌వ‌య్య‌ను నిల‌దీయ‌గా కలిసి తిరిగాం.. ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుందాం.. అన్నాడు. దీంతో స‌ద‌రు యువ‌తి.. వధువు తరుపువారికి విషయం చెప్పి పెళ్లి ఆపివేయించింది. అలాగే తనను మోసం చేసి గురవయ్యపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురవయ్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పంజాగుట్టలోని డెక్కన్ లాడ్జికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా అనుభవించాడని, గర్భం దాలిస్తే మాత్రలు మింగించి అబార్షన్ చేయించాలని ఫిర్యాదు పేర్కొంది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు గుర‌వ‌య్య‌ను అరెస్ట్ చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation