‘దిశ’ కేసు: వాటిపై స్పందించకుంటే రూ.10 లక్షలు ఫైన్..ఢిల్లీ హైకోర్టు వార్నింగ్

హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటన ఎంత కలవరం స్పృష్టించిందో మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత యావత్తు భారతావని కదిలింది. మళ్ళి ఇలాంటి ఘటన జరగకూడదని, నిందితులకు కఠినంగా శిక్షించాలని అందరు కోరుకున్నారు. ఆ తర్వాత ఎన్ కౌంటర్ జరగడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మళ్ళి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ దిశా కేసు ఇప్పటికి కూడా ఇంకా కోర్ట్ లో నడుస్తూనే ఉంది. అయితే దిశా ఘటన మీద ఓవర్ గా రియాక్ట్ అయినా పలు మీడియా, సోషల్ మీడియా సంస్థల మీద హైకోర్టు సీరియస్ అయ్యింది.

Image result for delhi high court

దిశ హత్యాచారం కేసులో ఆమె పేరు, ఫోటోలు సహా వివరాలను బహిర్గతం చేసినందుకు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ పిల్‌ పై బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్న ట్విట్టర్‌‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్‌ పై స్పందన తెలియచేయకపోతే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని ట్విట్టర్‌ ను హెచ్చరించింది. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాబోదని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఈ విషయంలో మీరెందుకు ఆలోచిస్తున్నారని ట్విట్టర్ నిర్వాహకులను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం, ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేయకపోతే జరిమానా తప్పదని తెలిపింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇటీవల అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతం చేసినందుకు మీడియా సంస్థలపై హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించిందని, ప్రస్తుతం మరోసారి దానిని పునరావృతం చేయకుండా ఉండాలంటే సమాధానం ఇవ్వాలని హెచ్చరించారు. నాలుగు వారాల్లోగా అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం, విచారణను మే 4కి వాయిదా వేసింది. హత్యాచారానికి గురైన హైదరాబాద్ యువ వైద్యురాలి వివరాలను బహిర్గతం చేసి మీడియా సంస్థలు, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో లాయర్ యశ్‌దీప్ చహల్ పిల్ దాఖలు చేశారు. అత్యాచారం సహా ఇలాంటి ఘటనల్లో బాధితుల వివరాలను వెల్లడించడం ఐపీసీ సెక్షన్ 228ఎ ప్రకారం శిక్షార్హమైన నేరం. ఇలా చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. దిశ కేసులోనూ మీడియా సంస్థలు, సోషల్ మీడియ వేదికలు ఐపీసీ సెక్షన్ 228ఏ ఉల్లంఘించాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. చూడాలి మరి దీని మీద ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో..

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation