సీన్ రివర్స్ పోలీసుపై దాడి

దేశమంతటా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో వుండగా ఎందుకు రోడ్డుపైకి వచ్చారని అడిగిన పాపానికి ఓ పోలీసును కొందరు చితకబాదిన ఉదంతం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

attack on home guard, #Attack on Police లాక్ డౌన్ అంటే పోలీసుపై దాడి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ మండల పోలీసులు బుధవారం కొందుర్గ్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా షాద్ నగర్ నుండి పరిగి వైపు వెళ్తున్న పరిగికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంలో పోలీసులు వాహనాన్ని ఆపారు. దేశమంతా లాక్ డౌన్ ఉందని, బయటికి రావద్దని చెప్పేందుకు పోలీసులు ట్రై చేశారు. అయితే పోలీసుల మాటలతో ఆగ్రహం చెందిన వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృషారెడ్డి , రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హోమ్ గార్డ్ వెంకటేష్ పై దాడికి దిగారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

హోం గార్డుపై దాడికి దిగిన సందర్భంలో అక్కడే వున్న కొందరు వారి దాడిని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వారి ఆదేశాల మేరకు హోం గార్డుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై ఐపీసీ 188, 332,సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు.

Content above bottom navigation