టిక్ టాకా.. నేనా తేల్చుకో.. నువ్వొద్దు నాకు టిక్ టాకే ముద్దు.. భార్య సంచలనం..?

TikTok… యువత మనసు దోచేసిన వీడియో షేరింగ్ యాప్ ఇది. కుర్రాళ్లలో టిక్ టాక్ యాప్ గురించి తెలియని వాళ్లుండరు. సాదారణంగ ఇప్పుడు ప్రతి ఒక్కరు టిక్ టాక్ ని ఉపయోగిస్తున్నారు. ఈ టిక్ టాక్ ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది. ఇందులో చాలా వరకు మంచి మంచి వీడియోస్ ని అప్లోడ్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటారు. అయితే ఈ టిక్ టాక్ యాప్ కు ఎందరో అడిక్ట్ అయ్యారు. అది ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టింది. ఇప్పుడు కూడా ఇద్దరు దంపతులను విడదీసింది. భార్య టిక్ టాక్ లో అసభ్యంగా వీడియోలు చేస్తుందని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, టిక్ టాక్ కావాలా నేను కావాలా తేల్చుకో అని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇలా అడిగితే ఏ భార్య అయినా నాకు భర్తే కావాలని అంటాడు. కానీ ఈ భార్య మాత్రం నాకు టిక్ టాకే ముఖ్యమని భర్తకు షాకిచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

బెంగళూర్ లో నివసించే రాజేష్ కు 2012 సంవత్సరంలో రమణితో పెళ్లయింది. వీరికి 2014 సంవత్సరంలో వారికి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత భర్తకు జాబ్ రావడంతో సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. భర్త దుబాయ్ వెళ్లిపోవడంతో రమణి కొడుకు బాగోగులు చూసుకుంటుంది. అయితే ఇంట్లో ఒంటరిగా ఉండడంతో సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యింది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి వచ్చింది టిక్ టాక్. ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అప్పుడప్పుడు టిక్ టాక్ లో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఆమె వీడియోలో బాగా వైరల్ అవ్వడంతో, ప్రతి రోజు ఎక్కువగా లైకులు షేర్లు కామెంట్లు వస్తుండడంతో దానికి ఎడిక్ట్ అయిపోయింది. చాలా తక్కువ సమయంలోనే ఆ మహిళకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగిపోయారు. ఈ క్రమంలోనే తన భార్య టిక్ టాక్ చేసిన వీడియోని అతని ఫ్రెండ్ చూపించడంతో రాజేష్ ఖంగు తిన్నాడు. ఆ వీడియోలో భార్య అసభ్యంగా డాన్సు చేస్తుంటే కామెంట్లు కూడా మరింత అసభ్యంగా రావడంతో కోపంతో ఊగిపోయిన భర్త ఫోన్ చేసి భార్యను మందలించాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

వీడియో కాల్ లో భార్యతో గొడవపడగా, నేనేమీ అసభ్యంగా డాన్స్ చేయడం లేదు. మీ ఫ్రెండ్ తప్పుగా నా వీడియోలను చూపించాడు అంటూ భర్తకే ఎదురు తిరిగి మాట్లాడింది. ఇక అనుమానం వచ్చిన భర్త మంచి జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. నీ టిక్ టాక్ వీడియోలు బాగాలేవు, చెయ్యొద్దు అన్నాడు. దానికి నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు అని రమణి బోరున ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత భర్త పోలీసుల దగ్గరకు వెళ్ళగా పోలీసులు ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు పంపించారు. అక్కడ భర్త టిక్ టాక్ వదిలేయాలి అని చెప్పినప్పటికీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. నేను కావాలా, టిక్ టాక్ కావాలో తేల్చుకో అని అంటే, నాకు టిక్ టాక్ గుర్తింపు ఇచ్చింది. నాకు టిక్ టాక్ ముఖ్యం అని చెప్పింది. లక్షలాది మంది ఫాలోవర్లు నిరాశపరిచలేనని తెలిపింది. అయితే ఈ దంపతులిద్దరి మధ్య రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్పుకొచ్చారు. చూశారుగా టిక్ టాక్ వీడియోలు ఈ దంపతులిద్దరి మధ్య గొడవకు ఎలా కారణమయ్యాయో. చివరికి ఈ దంపతులు విడిపోతారో, లేక టిక్ టాక్ ను దూరం చేసుకుని కలుసుకుంటారో చూడాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation