తిరుమల శ్రీవారి మెట్లపై నెత్తుటి మరకలు

113

తిరుమ‌ల వెంక‌న్న‌ని ద‌ర్శించుకునేందుకు రోజు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌స్తూ ఉంటారు
నిత్యం భ‌క్తుల‌తో ఏడు కొండ‌లు కిట‌కిట‌లాడుతాయి.స్వామిని ఒక్కసారి చూడాలి అని రోజుల కొద్ది క్యూ లైన్లో వేచి ఉంటారు.ఇక ముక్తి భ‌క్తి మార్గంగా తిరుమల ప్రాశ‌స్త్యం ఎంతో గొప్ప‌ది.అయితే నిత్యం మెట్ల మార్గంలో కూడా భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకునేందుకు వేలాదిగా వెళ‌తారు.ప్రఖ్యాత తిరుమలలో బ్రహ్మాండనాయకుడి దర్శనం కోసం మెట్లమార్గంలో వెళ్లిన భక్తులు.. అక్కడి భీకర దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలోని 270 మెట్టు దగ్గర సోమవారం ఉదయం దట్టంగా నెత్తుటి మరకలు పేరుకుపోవడం అందరినీ కలవరపెట్టింది. భక్తుల ఫిర్యాదుతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. విజిలెన్స్ విభాగం ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.

fear in tirumala devoties as deer killed at srivari mettu, ttd vigilance enquiring matter

శ్రీవారి మెట్ల మార్గంలో అందరినీ షాక్ కు గురిచేసిన ఆ రక్తపు మరకలు.. దుప్పివని తెలుస్తోంది. మెట్ల మార్గంలో చాలా కాలంగా చిరుతపులి సంచరిస్తుండటం, కొన్ని నెలల కింద తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులపై చిరుత దాడి చేయడం తెలిసిందే. దుప్పిని వేటాడింది కూడా చిరుతపులే అయిఉండొచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అది వేటగాళ్ల రేసు కుక్కల పని కూడా అయి ఉండొచ్చనే అనుమానాల్ని వారు వ్యక్తం చేశారు. ఆ మేరకు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

తిరుమల కొండపైకి వెళ్లే రెండు మార్గాల్లో అలిపిరి మార్గం, శ్రీవారి మెట్ల మార్గం ప్రధానమైనవి. మెట్ల మార్గంలోని అటవీప్రాంతంలో జంతువులు సంచరిస్తుంటాయి.. కాబట్టి రాత్రి వేళల్లో ఈ మార్గంలోకి భక్తుల్ని అనుమతించరు. సోమవారం నాటి చిరుత దాడి కార‌ణంగా మెట్ల మార్గంలో భద్రత కట్టుదిట్టం చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. రాత్రి వేళ‌ల్లో గ‌స్తీగా చూస్తాము అని చెబుతున్నారు, మెట్ల మార్గంలో వ‌చ్చే భ‌క్తులు జాగ్ర‌త్త‌గా రావాలి అని అధికారులు తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation