తెరాస కీలక నేతను నడిరోడ్డుపై నిలబెట్టిన కాల్చి చంపిన మావోయిస్టులు

778

జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా చంపేశారు. వెంకటాపురం మండలం నూగూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 మంది మావోయిస్టులు భీమేశ్వరరావు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే దారుణంగా కొట్టి చంపేశారు. అత్యవసరంగా డబ్బులు కావాలి… ఆస్పత్రికి వెళ్లాలి అంటూ… ఆయన్ని బయటకు రమ్మన్నారు.

ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బులు లేవన్న భీమేశ్వర్… డోర్ తియ్యలేదు. దాంతో మావోయిస్టులు డోర్‌పై కాల్పులు జరిపి… భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. నిద్రమత్తులోనే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మావోయిస్టులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచారు. తనను చంపొద్దని మీరు ఏం చెబితే అది చేస్తానని భీమేశ్వర్ వేడుకున్నా… మావోయిస్టులు ఆగలేదు. ప్రాణాలు తీసేశారు.

ఈ హత్య ఎవరు చేశారో అని పోలీసులు ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదంటూ… తామే హత్య చేసినట్లుగా నిరూపించేందుకు ఘటనా స్థలంలో ఓ లేఖను వదిలి వెళ్లారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల అంచనా ప్రకారం… తమ లేఖలో మావోయిస్టులు… టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్లు చేశారు.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation