ఏపీలో మూడు పాజిటీవ్ కేసులు విశాఖ‌లో హై అల‌ర్ట్

128

ఉరుముల్లేని పిడుగులా కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. ప్రాణాంతక వైరస్‌ను నిరోధించడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రజలను ఇళ్లు దాటి బయటకు రావద్దని, పరిశుభత్ర పాటించాలని,సమూహాలకు దూరంగా ఉండాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. కొత్తరకం ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం 117 దేశాలకు వ్యాపించింది.కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 10,000 మందికిపైగా మృతిచెందగా, వైరస్ సోకినవారి సంఖ్య 2,45,600 దాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి….నిన్న‌టి వ‌ర‌కూ రెండు కేసుల‌తో డేంజర్ బెల్ మోగించిన క‌రోనా ఏపీలో మెల్ల‌గా వ్యాపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో మస్కట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే లండన్ నుంచి ఒంగోలు వచ్చిన ఓ యువకుడికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పుడు మక్కా నుంచి విశాఖపట్నం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా వైరస్ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖబులిటెన్ విడుదల చేసింది. విశాఖపట్నంలో ఒక కోవిడ్-19 పోజిటివ్ కేసు నమోదయ్యింది.

తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

Image result for corona virus

విశాఖ‌ నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మక్కా వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కి పంపించారు.నిన్న అక్కడి నుంచి నివేదిక రాగా వృద్ధుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వుంచి చికిత్స అందించడంతోపాటు అతను నివాసం ఉన్న ప్రాంతంలో వైద్యబృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడికి వెళ్లాడు? తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్ధుడి నివాస ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

Image result for coronavirus patient

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొవిడ్ -19 పాజిటివ్ బాధితులు కోలుకుంటున్నారనివైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో వదంతుల్ని నమ్మొద్దని, కొవిడ్-19 వార్తల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దాన్ని అతిక్రమిస్తే ‘ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపిసి సెక్షన్ 188’ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ క్రింది వీడియో చూడండి

మాస్కులు , శానిటైజర్ల కొరత లేదని, కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని సూచించారవెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని చెప్పారు. కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 966 మంది ప్రయాణికుల్ని గుర్తించామని చెప్పారు. 677 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని అన్నారు. 258 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. 31 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని, 119 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 104 మందికి నెగటివ్ వచ్చిందిని చెప్పారు. 12 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని జవహర్ రెడ్డిచెప్పారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి వెళ్లకూడదని సూచించారు. కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదుని, 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని జవహర్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేసినట్లు జవహర్ రెడ్డి తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation