భక్తురాలితో లేచిపోయిన స్వామిజీ..కంగుతిన్న గ్రామ ప్రజలు

198

కాషాయం ధరించి ఆధ్యాత్మిక మాటలు చెప్పాడు. తత్వం బోధిస్తూ ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తానని నమ్మించి నయ వంచనకు పాల్పడ్డాడు. మనసు నిండా కామ ఆలోచన పెట్టుకొని పైకి ధైవత్వాన్ని ప్రదర్శించాడు. తాను దేవుడి స్వరూపమని చెప్పి గ్రామస్తులకు దగ్గరై చివరకు ఓ యువతిని లేవదీసుకుపోయాడు. కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆ దొంగ బాబా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

nvvn

విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌కు చెందిన దత్తాత్రేయ అవధూత రెండు నెలల క్రితం హొళలి గ్రామానికి వచ్చాడు. కాషాయం దుస్తులు, గుబు గడ్డంతో ఉన్న అతడు దేవుని స్వరూపమని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామంలోని భీమలింగేశ్వర ఆలయంలో పూజారిగా ఉంటానని నమ్మించాడు. త్వరలోనే ఆశ్రమాన్ని స్థాపించి గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పాడు. అంతా దానికి అంగీకరించడంతో ప్రతి రోజు ఆయనకు పూజలు చేసేవారు. తన వద్దకు వచ్చిన వారికి మంచి మాటలు చెప్పి రంజింప జేసేవాడు. కానీ ఓ రోజు తనలోని రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టాడు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ప్రతిరోజూ స్వామి పాదపూజ చేసుకునేందుకు వచ్చే 20ఏళ్ల భక్తురాలిపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ యువతి శివరాత్రి రోజు స్వామీజీకి పాదపూజ చేసి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. ఆందోళన పడిన కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా లాభం లేకపోవడంతో ఆందోళన చెందారు. అదే సమయంలో స్వామీజీ కూడా కనిపించడం లేదని తెలియడంతో అతడే ఆ యువతిని ఎత్తుకెళ్లాడని భావించారు. ఇటీవలే యువతి సోదరుడికి ఫోన్ చేసిన స్వామిజీ తాము తిరుపతిలో పెళ్లి చేసుకున్నామని త్వరలోనే తిరిగి వస్తామని సెలవిచ్చాడు. ఇంత కాలం అతడి ప్రేమ వ్యవహారాన్ని చివరివరకు పసిగట్టలేకపోవడంపై గ్రామస్తులు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

Content above bottom navigation