2020 ఏ రకంగా చేసినా అశుభమే. అంతా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఈ ఏడాది ఎవరికీ కలిసి రాలేదు. ఇక పలువురు సినీప్రముఖుల మరణాలు కలవరం రేపుతున్నాయి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో చెదురుముదురు ఘటనలు కలతకు గురి చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా తెలుగు సినీపరిశ్రమ దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం నెలకొంది.
సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి (74) గుండె పోటుతో కన్ను మూశారు. దీంతో పరుచూరి ఇంట విషాదం నెలకొంది. విజయలక్ష్మీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేయగా.. వెంకటేశ్వరరావుకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మూవీ ఆర్టిస్టుల సంఘం సహా పలు అసోసియేషన్లు తమ సానుభూతిని వ్యక్తం చేశాయి.