పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ బెదిరింపు..

సంచలన తార శ్రీరెడ్డి గురించి మన అందరికి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో మహిళలను లైంగికంగా లొంగదీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని గతంలో శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లేవనెత్తిన ఈమె ఆ తర్వాత టాలీవుడ్ పరిశ్రమకే చుక్కలు చూపించింది. నది రోడ్డుపైనే అర్థ నగ్నంగా నిలబడి తన నిరసన తెలియజేసింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా శ్రీ రెడ్డి పేరు మారు మోగింది. అలా భారీ పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ మంచి ఫాలోయింగ్ కూడా కూడగట్టుకుంది. అయితే ఆమె సోషల్ మీడియా ఖాతా తెరిస్తే మాత్రం అన్నీ వల్గర్ పోస్టులే కనిపించడం కామన్ అయింది. ఇప్పుడు శ్రీరెడ్డి మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమై తన గోడు వెలిబుచ్చింది. తనను హత్య చేస్తానంటూ బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. మరి ఇంతకీ శ్రీ రెడ్డిని అంతలా ఎవరు బెదిరిస్తున్నారు? అసలు కథేంటి? అనే వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్ – శ్రీ రెడ్డి – కరాటే కళ్యాణి మధ్య నడుమ నడుస్తున్న వివాదం రోజురోజుకు ముదురుతూ వస్తోంది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కామెంట్స్ చేసుకుంటూ గత పది రోజులుగా రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు ఈ వివాదాన్నీ పోలీస్ స్టేషన్‌ వరకు తీసుకుపోయారు రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలు. వాళ్లిద్దరూ శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ చేశారు. కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి.. కళ్యాణి గురించి మాట్లాడుతూ అసభ్యపదజాలంతో నోటికొచ్చినట్లు దూషించారు. కళ్యాణి ఇప్పటివరకు ముగ్గురు భర్తలను వదిలేసిందని, ఈ విషయాన్ని ఆమె మాజీ భర్తే తనకు చెప్పాడని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వల్గర్‌గా మాట్లాడినందుకు శ్రీరెడ్డిపై కేసు పెట్టింది కళ్యాణి. తనపై అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి మాట్లాడుతుందని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దాంతో రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలకు సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. తనపై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ ఆ ఇద్దరిపై బూతు పదజాలం ఉపయోగిస్తూ వల్గర్ కామెంట్స్ చేసింది.

Image result for పోలీస్ స్టేషన్‌ శ్రీ రెడ్డి

దీంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో శ్రీరెడ్డి మరో అడుగు ముందుకేసింది. బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్‌ లో ప్రత్యక్షమై కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లపై తన ఫిర్యాదు చేసింది శ్రీరెడ్డి. వాళ్లిద్దరూ తనను హత్య చేస్తానని బెదిరిస్తునట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, తాను రెండు చిత్రాల్లో నటిస్తున్నాని చెప్పింది. అందుకే కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. తాను చెన్నైలో కొనుకున్న ఇంటికి సంబంధించి ఏదోదో మాట్లాడుతున్నారని, దీనిపై నిలదీస్తే పెట్రోలు పోసి తగలపెడతానని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో శ్రీరెడ్డి పేర్కొంది. దీంతో శ్రీ రెడ్డి – రాకేష్ మాస్టర్ – కరాటే కళ్యాణి వివాదం మరింత ముదిరింది. చూడాలి మరి ఇంకా ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation