గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడు మాత్రమే కాదు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు కూడా. వివాద రహితుడు. తెలుగు, తమిళం సహా అనేక భాషల్లో పాటలు పాడి, సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఆయన గురించి, ఆయన ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలు. ప్రస్తుతం చెన్నయ్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఆయనకు వైద్య చికిత్స అందిస్తోంది. తమిళనాట ‘అమ్మ’ జయలలిత తర్వాత, ఆ స్థాయిలో ఎస్పీ బాలు ఆరోగ్యం గురించిన చర్చ జరుగుతోంది.