స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్ షాక్ లో సినీ ఇండస్ట్రీ

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. Covid-19 ధారాళంగా విస్తరించడం వలన ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం పెరుగుతున్నారు. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కు కరోనా వచ్చింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

ఉక్రెయిన్‌లో జన్మించిన నటి, మోడల్‌ ఓల్గా కురెలెంకో తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చినట్టు వెల్లడించింది. ఓల్గా గ‌తంలో జేమ్స్‌బాండ్ సీరిస్ సినిమాల్లో సైతం న‌టించింది. 2008 జేమ్స్‌బాండ్‌ మూవీ క్వాంటం ఆఫ్‌ సొలేస్‌లో ఓల్గా కురెలెంకో నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే 2013లో వ‌చ్చిన సైఫై సినిమాలో సైతం ఆమె త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇక గ‌త వారం రోజులుగా ఆమె తీవ్ర అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె హాస్ప‌ట‌ల్ కు వెళ్ల‌గా అక్క‌డ క‌రోనా టెస్ట్ చేయ‌గా… ఆమెకు క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు వెల్ల‌డైంది. ఈ విష‌యాన్ని ఓల్గా (40) తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పేర్కొన్నారు. వారం రోజలుగా తాను అస్వస్తతతో బాధపడుతూ, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో సమూహానికి దూరంగా ఇంట్లోనే ఒంటరిగా ఉన్నానని ఓల్గా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పేర్కొన్నారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రు కూడా క‌రోనా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆమె సూచించింది.

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం గతవారం కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే హాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ టామ్‌ హ్యాంక్స్‌, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఓల్గా కురేలేంకో కూడా చేరింది. ఇక ఈ లిస్టులో ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. లాస్ట్ వీక్ కరోనాతో బాధపడుతూ యూనివర్సల్‌ మ్యూజిక్‌ అధినేత, సీఈవో లుసియన్‌ గ్రినేజ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇలా చాలామంది ప్రముఖులు కరోనా మూలాన హాస్పిటల్ బారిన పడుతున్నారు. మ‌రి ఈ వైర‌స్ ఎప్పుడు త‌గ్గు ముఖం ప‌డుతుందో ? ప్ర‌పంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation