హిజ్రా ని ప్రాణంగా ప్రేమించాడు.. చివరికి ఏమైందో తెలిస్తే కన్నీళ్లే..

ప్రేమ గుడ్డిది అంటారు.. నిజంగానే ఇప్పుడు నేను చెప్పే కథ వింటే మీకు అలానే అనిపిస్తోంది. ఎంత ప్రేమించినా కూడా పరిమితికి మించి ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే ఈ ఇద్దరి ప్రేమికులలాగానే అవుతుంది. ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశానికి లోనై తమ అనుకున్న వాళ్లను కడతేర్చి కటకటాల పాలవుతూ తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి హిజ్రాను ఓ యువకుడు క్షణికావేశానికి లోనై ఆమెను హతమార్చిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహమదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for hijra with boy

అహ్మదాబాద్ ప్రాంతంలో మమతా మసి అనే హిజ్రా నివాసం ఉంటోంది. ఈమె స్థానికంగా ఉన్నటువంటి అజయ్ నలియా అనే యువకుడితో ప్రేమలో పడింది. దీంతో ఇద్దరు మొదట్లో ఎక్కడికెళ్లినా చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉండే వాళ్ళు. అంతేగాక మమత, అజయ్ నలియా, అజయ్ నలియా స్నేహితుడు కలిసి ఒకే ఇంట్లో నివసించే వాళ్ళు. అయితే కొద్దిరోజుల తర్వాత మమత స్నేహితురాలైన మరో హిజ్రాని తన ప్రియుడికి పరిచయం చేసింది. ఈ క్రమంలో అజయ్ నలియా, ఆమె ఫ్రెండ్ సన్నిహితంగా మెలిగేవారు. దీంతో వారిద్దరిపై అనుమానం పెంచుకున్న మమత తన స్నేహితురాలికి దూరంగా ఉండాలని పలుమార్లు తన ప్రియుడిని హెచ్చరించింది. అయినా కూడా అజయ్ నలియా మమత ఫ్రెండ్ కు దూరంగా ఉండలేదు. దాంతో మరింత అనుమానం పెంచుకుని అతనితో గొడవపడేది.

ఈ క్రింద వీడియో చూడండి:

అయితే అజయ్ నలియా మాత్రం తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని, నాకు అన్నీ నువ్వే అని చెప్పినా కూడా మమత అసలు వినేది కాదు. నన్ను నువ్వు మోసం చేస్తున్నావు. నీకు నా ఫ్రెండ్ తో సంబంధం ఉందని గొడవ పెట్టుకునేది. రోజు గొడవపడినట్టే నిన్న కూడా ఈ విషయం మీద పెద్ద గొడవ అయ్యింది. ఈ గొడవలో మాట మాట పెరిగి పెద్దదయ్యింది. తాను ఎవరితోనూ ఎలాంటి రిలేషన్‌షిప్స్ పెట్టుకోకపోయినా, తనను అనవసరంగా అనుమానిస్తోందని అజయ్ ఫుల్లుగా ఫైర్ అయ్యాడు. “ఒకప్పుడు ప్రేమగా మాట్లాడే నువ్వు… ఇప్పుడు నాపై ప్రేమతో లేవు. అందుకే ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు. అదే నచ్చిందిగా.. దాని దగ్గరకే పో అని అంది. అంతే… అజయ్‌కి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న కత్తితో మమతపై దాడి చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఘోరం జరిగింది. కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్ నలియాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation