హైదరాబాద్ శివారులోని షాద్నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటన ఎంత కలవరం స్పృష్టించిందో మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత యావత్తు భారతావని కదిలింది. మళ్ళి ఇలాంటి ఘటన జరగకూడదని, నిందితులకు కఠినంగా శిక్షించాలని అందరు కోరుకున్నారు. కానీ దిశ ఘటన నుంచి తేరుకోక ముందే సరిగ్గా అలాంటి దుర్ఘటన మరొకటి జరిగింది. ఈ సంఘటన కూడా తెలంగాణాలో చోటు చేసుకోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ(30) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రింది వీడియో చూడండి
మహిల శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో ..అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఆమెను అత్యాచారం చేసి, ఆమె వస్తువులను తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఇది దొంగల పనా..లేక ఎవరైనా తెలిసినవాళ్ళు ఈమెను ఇక్కడికి తీసుకొచ్చి అత్యచారం చేశారా అని తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

సంఘటన స్థలంలో చుస్తే పెద్ద పెనుగులాట జరిగినట్టు తెలుస్తుంది. అత్యచారం సమయంలో నిందితుల నుంచి తప్పించుకోడానికి ఆ యువతీ తీవ్రంగా శ్రమించినట్టు తెలుస్తుంది. చేవెళ్ల డీఎస్పీ రవీందర్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశముంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి