ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి

5819

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు కేజే జస్టిన్ కొచ్చిలో శవమై తేలారు.. కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ ద‌గ్గ‌ర‌ జస్టిన్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక్కడి కంటైనర్ టెర్మినల్ ద‌గ్గ‌ర‌ ఆయన మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. అయితే ఆయ‌న మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుంటున్నారు.ఎందుకు అంటే ఆయ‌న‌కూ కూడా అక్క‌డ చాలా పెద్ద పేరు ఉంది, ఎంతో మంచి పేరు సంపాదించుకుని అక్క‌డ నివాసం ఉంటున్నారు ఆయ‌న‌. ఇటీవ‌ల జస్టిన్ చర్చికి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోదరుడు ఏసుదాస్ మాదిరే జస్టిన్ కూడా సంగీత రంగంలో ఉన్నారు. రచయిత కూడా అయిన జస్టిన్ ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో కుంగిపోయినట్టు చెబుతున్నారు. కొంతకాలం కిందట జస్టిన్ కొడుకు మరణించడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం ఆయన్ను వేదనకు గురిచేసి ఉంటాయని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే ఆయ‌న కుమారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత త‌న జీవితం పై విర‌క్తి చెందాను అని సన్నిహితుల‌తో అనేవార‌ట.. అలాగే ఆయ‌న నేడు మ‌ర‌ణించారు అని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

కొన్ని ఆర్ధిక ఇబ్బందులు వ‌చ్చినా వాటిని ఈ మ‌ధ్య ప‌రిష్క‌రించుకున్నారు, అయితే అన్నిటికంటే ఆయ‌న కుమారుడు లేడు అనే బాధ ఆయ‌న‌ని మ‌రింత క‌లిచివేసింది అంటున్నారు, అయితే ఈ వార్త తెలిసిన వెంట‌నే సోద‌రుడి కుటుంబాన్ని చూసేందుకు ఏసుదాసు వెళ్లారు అని తెలుస్తోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation