క్వారంటైన్లలో భీభత్సం: నర్సులు ముందు ఒంటిపై బట్టలు లేకుండా : బూతు పాటలతో హల్చల్..

198

కరోనా అనుమానితుల పేషెంట్లు, బాధితుల ప్రాణాలను కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతున్న డాక్టర్లు, నర్సులు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. క్వారంటైన్లలో ఉంటోన్న కొందరు కరోనా అనుమానిత పేషెంట్లు.. వైద్యానికి ఏ మాత్రం సహకరించట్లేదు. నర్సులు, మహిళా డాక్టర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా క్వారంటైన్లలో తిరుగాడుతున్నారు. దీనిపై ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Tracking coronavirus patients in Karnataka: Here's who went where ...
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో చాలామందికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొందరికి ఘజియాబాద్‌ లోని ఎంఎంజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ లో ఉంచారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారిలో కొందరు వైద్య పరీక్షలకు సహకరించట్లేదంటూ మహిళా డాక్టర్లు, నర్సులు ఫిర్యాదు చేశారు. తాము వైద్య చికిత్స నిర్వహించడానికి వెళ్లిన సమయంలో క్వారంటైన్లలో ఉన్న కొందరు అనుమానిత పేషెంట్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ కు ఫిర్యాదు చేశారు. బట్టలు లేకుండా తిరుగుతున్నారని, సిగరెట్లను తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తమ సమక్షంలో బూతు పాటలు పాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. నర్సులు చెప్పిన విషయాన్ని ధృవీకరించుకున్న తరువాత చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి వైద్య చికిత్సలను నిర్వహించడం కష్టతరమౌతుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పేషెంట్లు సహకరించినప్పుడే తాము వైద్యాన్ని అందించగలమని, క్వారంటైన్లలో అలాంటి వాతావరణాన్ని కల్పించాలని విజ్ఙప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రిని సందర్శించారు. పేషెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇక నిజాముద్దీన్ లో ప్రార్ధనలు జరిగిన మర్కజ్ భవనానికి వెళ్లిన వాళ్లలో చాలా మంది కరోనా భారిన పడ్డట్టు ప్రాధమిక అంచనాకు వచ్చింది కేంద్ర హోమ్ శాఖ.ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోపాటు ఆ భవనంలో ఉన్న ఉన్న వారందరికీ వైరస్ సోకినట్లు హోమ్ శాఖ అనుమానిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ , నేపాల్ , మయన్మార్, బాంగ్లాదేశ్ , శ్రీలంక , కజకిస్థాన్ నుంచి కూడా వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 21 నాటికి ముర్ఖజ్ భవనంలో మొత్తం 1746 మంది ఉన్నట్లు గుర్తించింది. వారిలో 1530 మంది మనదేశానికి చెందిన వారు కాగా 216 మంది విదేశీయులు ఉన్నట్టు గుర్తించారు. మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి పాల్గొన్న తబ్లీజ్ జమాత్ కార్యకర్తలకు 12 వందల మందిని స్క్రీనింగ్ చెయ్యగా 303 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించామని హోమ్ శాఖ అధికారులు తెలిపారు. మిగతా వారిని కూడా స్క్రీనింగ్ చేసి అవసరమైన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. మరోవైపు చాలా మంది వివరాలను ఇవ్వకపోవడంతో గుర్తించడం తలనొప్పిగా మారింది దాంతో రాష్ట్రాల పోలీసుల సహాయాన్ని తీసుకుంటోంది హోమ్ శాఖ.

Content above bottom navigation