రెండు రోజుల్లోనే..ఐదో లక్ష కేసులు

108

కరోనా స్పీడ్​ పెంచింది. ప్రపంచమంతా పాకేసి లక్షలాది మందిని తన ఖాతాలో వేసుకుంది. వేలాది మందిని బలి తీసుకుంది. ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నా అది మాత్రం కంట్రోల్​లోకి రావట్లేదు. ముఖ్యంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్​, ఫ్రాన్స్​ వంటి దేశాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. జస్ట్​ రోజుల వ్యవధిలోనే కేసులు లక్షల మార్కును దాటేశాయి.  లక్ష కేసులు దాటాక వైరస్​ మరింత స్పీడ్​ పెంచింది. ఫస్ట్​ లక్ష కేసులకు 67 రోజులు పడితే ఆ తర్వాతి లక్ష కేసులకు 12 రోజులు పట్టింది. అక్కడి నుంచి కేసులు పెరిగాయి.. టైం గ్యాప్​ తగ్గింది. మూడో లక్ష కేసులు జస్ట్​ 4 రోజుల్లోనే రికార్డయ్యాయి. నాలుగో లక్షకు రావడానికి జస్ట్​ 2 రోజుల టైమే పట్టింది. ఐదో లక్షకు చేరడానికీ రెండు రోజులే పట్టింది. ఈ లెక్కన వైరస్​ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 198 దేశాల్లో వైరస్​ తన ప్రతాపం చూపిస్తోంది.

Coronavirus disease 2019

ఇటు ఇండియాలోనూ వైరస్​ ఇన్​ఫెక్షన్​ జోరందుకుంది. మార్చి 11 నుంచి 26 మధ్య జస్ట్​ 15 రోజుల్లో కేసుల సంఖ్య 13 రెట్లు పెరిగింది. కరోనాను పాండెమిక్​గా డబ్ల్మూహెచ్​వో ప్రకటించిన జనవరి 30నే దేశంలో తొలి కేసు నమోదైంది. ఫిబ్రవరి 3 నాటికి 3 కేసులయ్యాయి. అదే నెల 20న ఆ ముగ్గురిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఫిబ్రవరి 28 నాటికి 2,880 శాంపిళ్లను టెస్ట్​ చేశారు. అందులో 1,572 శాంపిళ్ల క్వారంటైన్​ సెంటర్​ బయటి నుంచి వచ్చినవే. మార్చి 2న హైదరాబాద్, ఢిల్లీల్లో ఒక్కో కేసు నమోదైంది. మార్చి 10 నాటికి అవి కాస్తా 50కి చేరాయి. 15న వంద మార్కును దాటేశాయి. మార్చి 26 నాటికి (గురువారం) కేసులు 649 రిపోర్ట్​ అయ్యాయి. అంటే ఈ 15 రోజుల్లోనే కేసులు 13 రెట్లు పెరిగాయి.ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 5,03,203 కేసులు నమోదయ్యాయి.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

Coronavirus: What it does to the body - BBC News

కేసుల సంఖ్యలో ప్రస్తుతానికి చైనానే టాప్​లో ఉంది. 81,285 కేసులతో ఫస్ట్​ ప్లేస్​లో చైనా ఉన్నా, మరణాల్లో మాత్రం ఇటలీ టాప్. కేసుల్లోనూ ఇంకొక్క రోజులో చైనాను ఇటలీ దాటేసే అవకాశం ఉంది. ఇటు అమెరికా కూడా ఇటలీని ఫాలో అయిపోతోంది. చైనాను దాటేసేందుకు ఉరుకులు పెడుతోంది. మొత్తంగా ఇప్పటిదాకా ప్రపంచంలో కరోనాకు 22,340 మంది బలయ్యారు. 1,21,2275 మంది కోలుకున్నారు. ఇటలీలో ఎక్కువగా 7,503 మంది చనిపోయారు. ఆ తర్వాత స్పెయిన్​లో 4,145 మంది వైరస్​కు బలయ్యారు. అమెరికాలో మరణాల సంఖ్య వెయ్యి దాటింది. 1,080 మంది చనిపోగా, 75,066 మందికి వైరస్​ పాజిటివ్​ వచ్చింది. చైనాలో లోకల్​ కేసులు ఒక్కటీ రిపోర్ట్​ కాకపోయినా, విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్​గా తేలుతోంది. అక్కడ ఇప్పుడు ఆ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఆ కేసులే కొత్తగా 67 నమోదయ్యాయి. 7 ప్యాలేస్​ టెస్ట్​ స్టాఫ్​కు కరోనా పాజిటివ్​గా తేలడంతో మలేసియా రాజుసుల్తాన్​ అబ్దుల్లా సుల్తాన్​ అహ్మద్​ షా, ఆయన భార్య తుంకు అజిజా అమినా మైమునా ఇస్కాందరియాలు  7 రోజుల క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. ఇంటర్నేషనల్​ ఫ్లైట్స్​ను రష్యా రద్దు చేసింది. కరోనా ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న రష్యన్లు కాపాడే విమానాలు తప్ప అన్నింటినీ నిలిపేయాలని రష్యా ప్రధాని ఆదేశించారు. అయితే, డొమెస్టిక్​ విమానాలకు మాత్రం మినహాయింపునిచ్చింది.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

What is Coronavirus? - The New York Times

దాదాపు రెండు నెలల తర్వాత వైరస్​కు మూలమైన హుబెయ్​ ప్రావిన్స్​లో లాక్​డౌన్​ను ఎత్తేసింది చైనా. అయితే, ఎవరైనా ఎక్కడికైనా పోవాలంటే కరోనా లేదని తేల్చే టెస్ట్​ చేయించుకోవాలన్న రూల్​ పెట్టడంతో జనం హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. పాక్​లో కేసుల సంఖ్య వెయ్యి దాటడంతో 370 కోట్ల డాలర్ల లోన్​ ఇవ్వాల్సిందిగా ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​), వరల్డ్​​ బ్యాంక్, ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​లను కోరింది. ఐఎంఎఫ్​ను 140 కోట్ల డాలర్లు, వరల్డ్​ బ్యాంక్​ను వంద కోట్ల డాలర్లు, ఏడీబీని 125 కోట్ల డాలర్లను అడిగింది. అత్యాచార నేరంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న హాలీవుడ్​ ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్​స్టీన్​కూ కరోనా పాజిటివ్​ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.కరోనాతో ఫైట్​లో ఇండియా తప్పకుండా గెలుస్తుందని చైనా ధీమా వ్యక్తం చేసింది. అతి తొందర్లోనే వైరస్​ అంతం చూస్తుందని చెప్పింది. వైరస్​తో ఫైట్​లో సాయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆ దేశం థాంక్స్​ చెప్పింది. ఢిల్లీలోని చైనా ఎంబసీ ప్రతినిధి జి రోంగ్​ దీనిపై మాట్లాడారు. చైనాలోని సంస్థలు ఇండియాకు సాయం చేసేందుకు రెడీ అయ్యాయని, ఇప్పటికే డొనేషన్లు స్టార్ట్​ చేశారని అన్నారు. తాము వైరస్​ను తయారు చేయలేదని, ఏ దేశానికీ పంపించలేదని జి రోంగ్​ స్పష్టం చేశారు. చైనా వాళ్లను తప్పుబట్టడం మానేసి వైరస్​ను తమ దేశం ఎంత వేగంగా కట్టడి చేసిందో నేర్చుకోవాలని హితవు పలికారు. చైనా వైరస్​ అని పిలవడం మంచిది కాదన్నారు. అమెరికాలో ఒక్క ఫ్లూతోనే 2019లో దాదాపు 3 కోట్ల మంది బాధితులయ్యారని, 20 వేల మంది చనిపోయారని యూఎస్​ సీడీసీ చెప్పిందన్నారు.

చాలా మందికి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. ఆస్పత్రికి వెళ్లినా అందరికీ టెస్టులు చేయట్లేదు. దీంతో ఇంట్లోనే టెస్టులు చేసుకునేలా బ్రిటన్​ వెసులుబాటు కల్పించనుంది. రిపోర్ట్​ కూడా జస్ట్​ పావుగంటలోనే వచ్చేలా కిట్లను తయారు చేయించింది. అందుకు ఈకామర్స్​ దిగ్గజం అమెజాన్​ను ప్లాట్​ఫాంగా ఎంచుకుంది. అతి కొద్ది రోజుల్లోనే ఆ టెస్టు కిట్లను ఇళ్లకు పంపించనుంది. మొత్తం 35 లక్షల టెస్ట్​ కిట్లను కొన్నామని బ్రిటన్​ నేషనల్​ ఇన్​ఫెక్షన్​ సర్వీసెస్​ డైరెక్టర్​ షారోన్​ పీకాక్​ తెలిపారు. అమెజాన్​, బూట్స్​ వంటి స్టోర్లలో వాటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆక్స్​ఫర్డ్​లో మొదటి సారి టెస్టులు చేశాక ప్రజలకు వాటిని అందజేస్తామన్నారు. అవి బాగా పనిచేస్తాయని నిర్ధారించుకున్న తర్వాత అందరికీ అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఒక్క రక్తం చుక్కతో టెస్ట్​ చేసుకోవచ్చన్నారు.

Content above bottom navigation