మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన తెలుగు రాష్టాల్లో ఎంత సంచలన స్పృష్టించిందో మనకు తెలుసు. కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని, 2018 సెప్టెంబర్ 14న అల్లుడు ప్రణయ్ ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు. ఆ తర్వా మారుతీరావు 7 నెలలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ లెటర్ చాలా సింపుల్ గా ఉంది. రెండే వ్యాఖ్యల్లో ఆయన తన ఫీలింగ్స్ చెప్పేశారు. గిరిజా నన్ను క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు రా.. అని సూసైడ్ లెటర్ రాశారు. ఈ లేఖలో గిరిజా అంటే ఆయన భార్య.. ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోతున్నందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారనుకోవచ్చు.. ఇక తన కూతురు అమృతను తల్లి దగ్గరకు రమ్మని ఉద్దేశించి.. అమృతా.. అమ్మ దగ్గరకు రా అని రాశారు. ఆయన కొంత కాలంగా కూతురు అమృతతో రాయబారం నడిపినట్టు చెబుతున్నారు. తన వద్దకు వచ్చేస్తే, ఆస్తి మొత్తం ఆమె పేరుపై రాసేస్తానని రాయబారం నడిపారని అంటున్నారు. అయితే తన భర్తను చంపినా తండ్రి దగ్గరకు వెళ్ళడానికి అమృత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. అసలు తండ్రితో మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టం చూపించలేదు. నువ్వు చచ్చినా కూడా నేను రాను అని అమృత అనడంతో మారుతీరావు క్రుంగిపోయాడు. ఒకపక్కన కూతురు రావడం లేదు. మరొకపక్కన అల్లుడిని చంపినా కేసు మారుతీరావును వెంటాడాయి. ఎలాగూ ఉరిశిక్ష పడుతుందన్న భావనలో ఉన్న మారుతీ రావు, కూతురు కూడా కరుణించకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

అయితే మారుతీరావు చనిపోడానికి ముందు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడాడు అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు అయన కాల్ రికార్డ్స్ ను చెక్ చేశారు. ఆయన చివరిసారి ఎవరికి ఫోన్ చేశాడో చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారంట. ఆయన ఫోన్ చేసింది ఆయన కూతురు అమృతకే అంటా. అమ్మ అమృత నా దగ్గరకు వచ్చేసేయ్. నేను చేసింది తప్పే. కానీ ఇదంతా నీ మీద ఉన్న ప్రేమతో చేశాను. నీకు నా ప్రేమ అర్థం అవ్వడం లేదు.

నా దగ్గరకు వచ్చేయ్ తల్లి..నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాను అని చెప్పాడంట. కానీ అమృత అతని మాటలు పట్టించుకోకుండా రానని చెప్పేసింది. కూతురు ఇలా చెప్పేసరికి ఇక మారుతీరావు చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మారుతీరావు చనిపోతూ రాసిన లెటర్ ఇప్పుడు అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. చాలా దీనంగా అమ్మ దగ్గరకు అమృత అని రాశాడు. ఇదే మారుతీరావు చివరి కోరిక.

మరి ఇప్పుడు అమృత ఏం చేస్తుంది.. తండ్రి చివరి కోరిక తీరుస్తుందా.. తండ్రి మరణంతోనైనా ఆమె తన తల్లి వద్దకు చేరుతుందా అన్నది చూడాలి. అమృతకు ఇప్పుడు భర్త లేడు, కన్నతండ్రి చనిపోయాడు. ఇప్పుడు తనకు ఉన్నదల్లా కన్నతల్లి మాత్రమే. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆమె కూడా ఏమైనా చేసుకుంటుందేమో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో అమృత తల్లి దగ్గరకు వెళ్తుందా? మారుతీరావు మరణంపై అమృత స్పందించిన తీరు చూస్తే, ఆయన చివరి కోరిక తీరడం కష్టమే అనిపిస్తోంది. మరోవైపు ఆమె అసహ్యంచుకునే తండ్రి ఎలాగూ లేడు కాబట్టి తల్లి వద్దకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా నిర్ణయం తీసుకోవాల్సింది ఆమెనే. చూడాలి మరి అమృత ఏం చేస్తుందో..