కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

201

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్… అదే కరోనా వైరస్. చైనాలో విధ్వంసం సృష్టించిన ఈ వైరస్ ఇప్పుడు ఇటలీపై తన పంజా విసురుతోంది. తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200 దాటేసింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజలంతా 14 గంటల పాటు ఇళ్లకు పరిమితం అవ్వాలని కోరారు. అయితే జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి? జనతా కర్ఫ్యూ 14 గంటలకు ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉండటం వల్ల వైరస్ విచ్ఛిన్నం అవుతుంది.. మరింత గొలుసు కట్టుగా వ్యాపించే అవకాశం ఆగిపోతుంది. తద్వారా కరోనా వైరస్ చచ్చిపోతుంది.ఈ 14 గంటల తర్వాత ఫలితం సురక్షిత దేశం అనేది ప్రభుత్వ ఆలోచన.

ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఇలా తయారు చేసుకోండి (వీడియో)

అయితే కరోనా వైరస్ బ్రతికుండే జీవితం కాలం ఒక ప్రదేశంలో గరిష్టంగా 12 గంటలు అని.. జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉండటం వల్ల వైరస్ విచ్ఛిన్నం అవుతుంది.. మరింత గొలుసు కట్టుగా వ్యాపించే అవకాశం ఆగిపోతుంది. తద్వారా కరోనా వైరస్ చచ్చిపోతుంది.జనతా కర్ఫ్యూ వెనుక ఉన్న భారత ప్రభుత్వ ఆలోచన అది. అయితే దీనిపై సైంటిస్టులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. నిజానికి జనతా కర్ఫ్యూపై ప్రధాని మోదీ చేసిన జనతా కర్ఫ్యూ ఆలోచన చాలా మంచిది. కానీ వైరస్ మనుగడ కేవలం 12 గంటల మాత్రమే అని వస్తున్న వార్తల్ని మాత్రం నమ్మ వద్దంటున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.కరోనా వైరస్ ఏ ఉపరితలంపై ఎంత సేపు మనుగడ కొనసాగిస్తుందన్న విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ప్రిన్సటన్ వర్శిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షెన్ డిసీజెస్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (హామిల్టన్‌), సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తదితర సంస్థల శాస్త్రజ్ఞుల అధ్యయనం చేవారు. దీంతో ఆ ప్రకారం చూస్తే….. కరోనా వైరస్‌ రాగి ఉపరితలంపై 4 గంటలు, ప్యాకేజింగ్‌కు వాడే అట్టపెట్టెలపై 24 గంటలు ఉంటుంది. ప్లాస్టిక్‌, స్టెయిన్‌లెస్ స్టీల్‌ వస్తువులపై 2 నుంచి 3 రోజులపాటు, అల్యూమినియం, చెక్క, పేపర్‌పై 5 రోజుల దాకా బతకగలదు.

హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ నందిని రాయ్

ఈ క్రింది వీడియో చూడండి

మనం 14 గంటలపాటు ఇంట్లోనే ఉన్నంత మాత్రాన వైరస్‌ ఉన్న ప్రాంతాలు వైరస్‌లేని ప్రాంతాలుగా మారిపోవని వైద్య అధికారులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులకు వారి శరీరతత్వాన్ని బట్టి 4 నుంచి 14 రోజుల దాకా ఎలాంటి లక్షణాలూ కనపడవన్నారు. ఆ సమయంలో వారు క్యారియర్లుగా ఉంటారు. అంటే.. వారి నుంచి వైరస్‌ మరొకరికి పాకుతుంది. కాబట్టి.. ఆ 14 గంటలే కాక, వైరస్‌ ముప్పు తగ్గేవరకూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించడం మంచిదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందుకే 14 గంటలు ఇంట్లో ఉంటే వైరస్ తగ్గిపోతుందని అపోహలు వద్దు. కరోనా వైరస్ తగ్గేవరకు ప్రతీ రోజు సామాజిక బాధ్యతతో ఉందాం. ప్రభుత్వం చెబుతున్న అంశాల్ని సీరియస్‌గా పాటిద్దాం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation