తెలంగాణా లో ఈ నెల 31 వరకు లాక్ డౌన్

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం (మార్చి 22, 2020) ఉదయం 6 గంటల నుంచి తెలంగాణలో జనతా కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు…అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం (మార్చి 21, 2020) సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Image result for kcr pressmeet

ఈ సమావేశంలో కరోనా తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. 
అవరసరమైతే ఇంటింటికీ రేషన్ కూడా సరఫరా చేసేందుకు సిద్ధమన్నారు. నిత్యవరసరుకులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. 5 నుంచి 2 వేల వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటికి నిత్యవసరుకులను సరఫరా చేస్తామని చెప్పారు. తాము వెనుకడుగు వేయబోమని చెప్పారు.

Image result for kcr pressmeet

తెలంగాణలో ఆర్టీసీ బస్సులను కూడా బంద్ చేస్తున్నట్టు చెప్పారు. కేవలం డిపోకు 5 బస్సులు స్టాండ్ బైగా ఉంచుతామన్నారు. వర్తక, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను రాష్ట్రంలోకి రానివ్వమని అన్నారు. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేస్తామన్నారు.

ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయల షాపులు, పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చునని కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారితోనే ఈ సమస్యంతా వస్తోందన్నారు. 20వేలకు పైగా విదేశాల నుంచి వచ్చారని చెప్పారు. 11వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. జాయింట్ టీమ్ వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని తెలిపారు.

Image result for kcr pressmeet

ఇప్పటివరకూ 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఆ 21 మంది కూడా ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు.  స్వచ్ఛందంగా స్థానిక వైద్యులను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారికి నిరంతరం పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

Image result for kcr pressmeet

దండం పెట్టి చెబుతున్నా.. విదేశాల నుంచి వచ్చేవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లు మా బిడ్డలే.. ప్రభుత్వానికి వాలంటరీగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైరస్ లక్షణాలుంటే ఐసోలేషన్ కు తరలిస్తామన్నారు. వైరస్ లేకుంటే మందులిచ్చి పంపించి వేస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పారు. జలులు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. 

హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు

జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

Content above bottom navigation