ఆడవారికి నెలకి వచ్చేపిరియడ్స్ కికారణం బ్రహ్మపెట్టినశాపమా…

నెలసరి సమస్యల టైం లో కొందరు స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు..ఆసమ్యంలో కొందరికి ఒక పక్క ఓవర్ బ్లీడింగ్ అవుతూ నరకయాతన అనుభవిస్తారు.. మరో పక్క పొత్తికడుపులో నొప్పి వారి ప్రాణాలను తోడేస్తూ ఉంటుంది.. ఆ సమయంలో ఈ ఆడపుట్టుక ఎందుకు పుట్టామా అనుకునే స్త్రీలు చాలా మంది ఉంటారు..స్త్రీలకు ఇలా అవడానికి బ్రహ్మ పెట్టిన శాపమే కారణమా..అంటే ఔను అని చెబుతున్నారు పండితులు..ఇంతకీ స్త్రీలకు బ్రహ్మదేవుడు ఆ శాపం ఎందుకు పెట్టాడు..ఏ సందర్భంలో పెట్టాడో తెలుసుకుందాం..ఒకానొక సమయంలో ఇంద్రుడి మీద దేవగురువు అయిన బృహస్పతి కోపగించు కుంటాడు.. దీంతో ఇంద్రుడిని ఎదో ఒకటి చేసి ఆయన కోపాన్ని చల్లార్చేలా చేస్తాడు..అదే సమయంలో రాక్షసులు దేవలోకంపై దాడి చేయడానికి సిద్దపడతారు.. దీంతో ఇంద్రుడు భయపడి దేవలోకం నుంచి పారిపోతాడు..

Image result for girls periods

అలా పారిపొయిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు.. ఆసురులు దేవలొకంపై దాడి చేసిన విషయాన్ని బ్రహ్మకు చెప్పి తన లోకం తనకు కావాలని అలా రావదానికి ఏదైనా పరిష్కార మార్గం చూపించాలని కోరతాడు..బ్రహ్మ దేవుడు బాగా ఆలోచించి అలా నీ రాజ్యాన్ని తిరిగి పొందాలంటే ఒక మునీస్వరుడికి సేవ చెయ్యాలని సలహా ఇస్తాడు..నువ్వు చేసిన సేవతో ఆ మునీస్వరుడు సంతృప్తి చెందితే నీ రాజ్యం నీకు తిరిగి వస్తుందని చెబుతాడు..బ్రహ్మ సూచనతో ఒక మునీశ్వరుడికి సేవ చేయడం మొదలెడతాడు ఇంద్రుడు..ఆ మునీస్వరుని తల్లి అసుర స్త్రీ..కానీ ఆ విషయం ఇంద్రుడికి తెలియదు.. అలా అతనికి సేవలు చేస్తున్న సందర్భంలో ఒక రోజు తన లోకాన్ని అసురులు ఆక్రమించుకున్నారనే విషయాన్ని ఇంద్రుడు ఆ మునీశ్వరుని దగ్గర ప్రస్తావిస్తాడు…అతను శాశ్వతంగా దేవలోకాన్ని అసురులకు ఇచ్చేయమని చెప్పడంతో కోపగించుకున్న ఇంద్రుడు ఆ మునీస్వరుడిని చంపుతాడు.. అలా ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడిని హత్య చేసినందుకు గాను అతనికి బ్రాహ్మన హత్యా పాతకం చుట్టుకుంటుంది..ఇక అది తప్పించుకోవడనికి ఇంద్రుడు ఒక సంవత్సరమంతా ఒక పువ్వులో దాక్కొని అక్కడి నుండే ఆ మహావిష్ణువు ను ప్రార్దిస్తాడు..

Image result for girls periods

ఇంద్రుడి ప్రార్దనను అంగీకరించిన విష్ణు మూర్తి ప్రత్యక్షమయి కారణం అడుగుతాడు..జరిగిన విషయాన్ని విష్ణువు కి చెప్పి తనపై పడిన బ్రాహ్మణ హత్య పోవలంటే తాను ఏం చేయాలని అడుగుతాడు..దీంతో ఇంద్రుడికి కొన్ని సూచనలు చేస్తాడు..నీ పై పడిన నిందల వలన నీకు అనిపిస్తున్న బాధల్లో కొంత భాగాన్ని చెట్లు భూమి నీరు అలాగే స్త్రీలకు పంచి కొంతబాగాన్ని నువ్వు కూడా అనుభవించమని విష్ణువు సలహా ఇస్తాడు..దానికి ఇంద్రుడు ఆ బాధలన్నీ ఒకేసారి తొలగిపోయెలా ఒక వరాన్ని ప్రసాదించమని విష్ణు మూర్తిని కోరతాడు..దేవ్తల రాజు అయిన ఇంద్రుడు అలా అడిగేసారికి విష్ణువు జాలిపడి ఇప్పటి నుంచి చెట్లకు నీటికి భూమికి స్త్రీలకు సమానంగా పంచుతున్నట్టుగా ఇంద్రుడికి వరాన్ని ప్రసాదిస్తాడు ఆ విష్ణువు..నిజానికి ఇంద్రుడు మునీస్వారుడికి సేవ చేయడం ద్వారా నీ రాజ్యం నీకు వస్తుందని బ్రహ్మ దేవుడు చెప్పగా ఇంద్రుడు బ్రహ్మ చెప్పినట్టు చేయకుండా మునీశ్వరుడిని హత్య చేసి బ్రాహ్మన హత్య నిందను మూటగట్టుకున్నాడు..అతను విష్ణుమూర్తి కోసం ప్రార్దించినా బ్రాహ్మన హత్యా అనే బ్రహ్మ శాపం మాత్రం పోదు..కానీ ఎవరికైనా పంచమని చెబుతూ విష్ణు మూర్తి సలహా ఇవ్వడం వల్ల చెట్లకు నీటికి భూమికి స్త్రీల పైకి ఆ సాపం వల్ల వచ్చే బాధలను మళ్ళించడం జరుగుతుంది..అందుకే అప్పటి నుంచి ఆ శాపం కారణంగా చెట్లు చనిపోతున్నట్టుగా చివరి దశలో మళ్ళీ చిగురులు వేస్తూ ఉంటాయి..

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఇండ్రుడి శాపం లో కొంత భాగం నీతికి అందివడం వలన నీటిలో మునిగిన వారి శాపాన్ని అది తీసుకొని తనలో మునిగిన వారి పాపాలను ప్రక్షాలన చేస్తుంది.ఇక భూమికి ప్రాణుల భారాన్ని భరించేలా శాపాన్ని ఇవ్వడం జరిగింది.. అందుకే ఆ భూమి మనల్నందరినీ తన భుజ స్కందాలపై మోస్తుంది..ఇక ఇండ్రుడి శాపం కొంత భాగం మహిళలపై మళ్ళించదం కారణంగా వారికి రుతుక్రమం నెలసరి పీరియడ్స్ బాధ ఏర్పడింది..అయితే వారు తమ బిడ్డను నవమాసాలు మోసి ఆ బిడ్డకు జన్మనివ్వడం వలన సృష్టికి అధారభూతులుగా నిలుస్తున్నారు..అందువల్లే వారు మగవారికన్నా మెరుగైన పని చేస్తున్నామనే అనుభూతికి లోనవుతున్నారు..ఇది ఆడవారికి పీరియడ్స్ బాధలు రావడానికి అసలు కారణం..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation