కరోనా వార్డ్ నుంచి పారిపోయి ప్రియారాలితో పెళ్లి చివరికి క్లైమాక్స్ లో ట్విస్ట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. భారత్ లో ఈ మహమ్మారి ఒక్కొక్కరిలో వణుకు పుట్టిస్తుంది. కరోనా దెబ్బకు భారత్ లాక్ డౌన్ ను ప్రకటించింది. దాంతో జనాలు ఇంటి నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉంటె ఆ ప్రాణాంతక వైరస్ తమను భయపెట్టలేదని ఓ ప్రేమజంట అంటోంది. ప్రేయసి కోసం విదేశాల నుంచి వచ్చి..పోలీసులకు చిక్కాడు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఇతను..అందరీ కళ్లుగప్పి పరార్ అయ్యాడు. చివరకు ప్రేయసిని చేరుకున్నాడు. వీరిద్దరూ పరారయ్యారు. పోలీసులను ముచ్చెమటలు పట్టించిన ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Inside the big fat Indian wedding: conservatism, competition and ...
సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

త‌మిళ‌నాడులోని శివగంగైకు చెందిన విజయ్‌ విదేశాల్లో ఉంటున్నాడు. అతను మదురైకి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. విదేశాల నుంచి రాగానే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ అమ్మాయి కుటుంబ స‌భ్యుల‌కు మాత్రం ఈ ప్రేమ ఇష్టం లేదు. ఆ యువ‌తికి మ‌రో యువ‌కుడితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఆ యువ‌కుడు నేరుగా విదేశాల నుంచి రాగానే త‌న ప్రేయ‌సిని ద‌క్కించుకుని పెళ్లి చేసుకోవాల‌ని ప్లాన్ చేశాడు. ఈ సమయంలోనే కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఆలస్యం చేస్తే తన ప్రేయసి తనకు దూరం అవుతుందేమో అని భయపడి ఎలాగోలా మధురై చేరుకున్నాడు. ముందుగా మ‌ధురై విమానాశ్ర‌యంలో అధికారులు అత‌డికి ప‌రీక్ష‌లు చెయ్యగా, కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఇతడిని మధురై లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాధి ఉందా ? లేదా ? తెలుసుకొనేందుకు రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

ఇది ఇలా కొనసాగుతుంటే..అతను మాత్రం తన ప్రేయసిని దక్కించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. చివరకు 2020, మార్చి 26వ తేదీ గురువారం రాత్రి పరార్ అయ్యాడు. తిరుపరంగుండ్రంలో ప్రేయసి ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. తర్వాత..వీరిద్దరూ పరార్ అయ్యారు. ఆసుప‌త్రిలో ఉన్న యువ‌కుడు క‌నిపించ‌కుండా పోవ‌డంతో ఆందోళన చెందిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలియగానే పోలీసులు షాక్ అయ్యారు. చివ‌ర‌కు వాళ్లు డాక్ట‌ర్ల‌పై సీరియ‌స్ అయ్యారు. శుక్ర‌వారం ఉద‌యం అక్క‌డ ఒక్క సారిగా ఆందోళ‌న వాతావ‌ర‌ణం నెల‌కొంది. చివ‌ర‌కు అత‌డి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయ‌గా అత‌డు శివ‌గంగైకు వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అత‌డి ప్రేయ‌సిని సైతం క‌రోనా ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించారు. ఇక ఇటు త‌మ కుమార్తె క‌నిపించ‌డం లేదంటూ యువ‌తి త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే త‌మ కుమార్తెను తీసుకుని ప‌రారైన యువ‌కుడి తల్లి, సోద‌రుడిపై యువ‌తి బంధువులు దాడి చేయ‌డంతో వారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Content above bottom navigation